అక్షరటుడే, కామారెడ్డి: Ex Mla Jajala | రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిందని ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ విమర్శించారు. ఆరు గ్యారంటీల పేరుతో 420 హామీలు ఇచ్చిందని.. వాటిని అమలు చేయడంలో విఫలమైందన్నారు.
ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బాకీ కార్డుల కార్యక్రమం చేపట్టామన్నారు. ఇందులో భాగంగా గురువారం సదాశివనగర్ (Sadshivnagar) మండలం అడ్లూరు ఎల్లారెడ్డిలో (Adlur Yelalreddy) కాంగ్రెస్ బాకీ కార్డుల పంపిణీని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో (Assembly elections) ఆరు గ్యారెంటీల అమలు చేస్తామని 420 హామీలిచ్చిందన్నారు. హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ప్రభుత్వం హామీలను విస్మరించడాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తామని తెలిపారు.