HomeతెలంగాణConsumer Welfare Committee | తూకాల్లో మోసాలు అరికట్టాలి

Consumer Welfare Committee | తూకాల్లో మోసాలు అరికట్టాలి

- Advertisement -

అక్షరటుడే, ఇందూరు: Consumer Welfare Committee | వ్యాపారులు తూకాల్లో మోసాలకు పాల్పడకుండా చర్యలు తీసుకోవాలని వినియోగదారుల సంక్షేమ సమితి నాయకులు కోరారు. ఈ మేరకు మంగళవారం జిల్లా తూనికలు, కొలతల శాఖ కార్యాలయంలో (Department of Weights and Measures) అధికారులను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. లీగల్ మెట్రాలజీ అధికారుల (Legal Metrology Officers) నిరంతర తనిఖీలతోనే మోసాలకు అడ్డుకట్ట వేయవచ్చన్నారు.

ఈ క్రమంలో ఈనెల 14 నుంచి చాంబర్ ఆఫ్ కామర్స్ (Chamber of Commerce), వ్యవసాయ శాఖ సమన్వయంతో లీగల్ మెట్రాలజీ నిబంధనలపై వ్యాపారస్తులు, వినియోగదారులకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో వినియోగదారుల మండలి జాతీయ ప్రధాన కార్యదర్శి సాంబరాజు చక్రపాణి, భారత వినియోగదారుల సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి సందు ప్రవీణ్, నిజామాబాద్ జిల్లా ఇందూర్ వినియోగదారుల సంక్షేమ సమితి జిల్లా అధ్యక్షుడు పెందోట అనిల్, ఉపాధ్యక్షుడు వీయన్ వర్మ, కార్యదర్శులు గైని రత్నాకర్, మహాదేవుని శ్రీనివాస్, యాటకర్ల దేవేష్ పాల్గొన్నారు.

Must Read
Related News