ePaper
More
    Homeఆంధ్రప్రదేశ్​Tirumala | శ్రీవారి దర్శనం టికెట్ల పేరుతో మోసం

    Tirumala | శ్రీవారి దర్శనం టికెట్ల పేరుతో మోసం

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Tirumala | తిరుమల శ్రీవారిని నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు. స్వామివారి సేవలో ఎంతో మంది తరిస్తారు. అయితే భక్తుల రద్దీ అధికంగా ఉండడంతో త్వరగా దర్శనం చేపిస్తామని, వీఐపీ టికెట్లు(VIP Tickets) ఇప్పిస్తామని కొందరు మోసాలకు పాల్పడుతున్నారు. భక్తుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని డబ్బులు వసూలు చేస్తున్నారు.

    Tirumala | రూ.50 వేలు వసూలు

    శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులను కొందరు కేటుగాళ్లు మోసం చేస్తున్నారు. త్వరగా దర్శనం చేయిస్తామని నమ్మిస్తున్నారు. తాజాగా ఇలాగే మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు అందింది. టీటీడీ సభ్యుడు, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పేరుతో ఓ వ్యక్తి మోసాలకు పాల్పడుతున్నాడు. వీఐపీ బ్రేక్ దర్శనం (VIP Break Darshanam), సేవా టికెట్ల (Seva Tickets) ఇప్పిస్తానని భక్తుల నుంచి వంశీ అనే వ్యక్తి రూ.50 వేలు వసూలు చేశాడు. ఈ విషయాన్ని గుర్తించిన ఎమ్మెల్యే పీఏ పోలీసులకు (AP Police) ఫిర్యాదు చేశారు.

    Tirumala | అధికారులు చెబుతున్నా..

    శ్రీవారి భక్తుల రద్దీని కొందరు దళారులు ఆసరాగా చేసుకొని మోసాలకు పాల్పడుతున్నారు. టీటీడీ వెబ్​సైట్, కౌంటర్ల ద్వారానే టికెట్లు ఇస్తామని, దళారులను నమ్మి మోసపోవద్దని అధికారులు సూచిస్తున్నా.. భక్తులు (Devotees) వారిని నమ్మి మోసపోతుండడం గమనార్హం. తాజాగా టికెట్ల పేరుతో మోసం చేసిన వంశీపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

    Tirumala | కొనసాగుతున్న భక్తుల రద్దీ

    తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శుక్రవారం వైకుంఠం క్యూ కాంప్లెక్స్​లోని అన్ని కంపార్టుమెంట్లు నిండి వెలుపల క్యూ లైన్‌లో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతోంది. గురువారం స్వామివారిని 63,473 మంది భక్తులు దర్శించుకోగా.. 27,796 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా టీటీడీకి రూ.4.54 కోట్ల ఆదాయం వచ్చింది. వీకెండ్​ కావడంతో రేపు, ఎల్లుండి భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉంది.

    More like this

    Alumni reunion | 14న పూర్వ విద్యార్థుల సమ్మేళనం

    అక్షరటుడే, భిక్కనూరు: Alumni reunion | మండలంలో జిల్లా పరిషత్​ బాలుర ఉన్నత పాఠశాల 1989–90 బ్యాచ్​ పదో...

    Yellareddy | అటవీ భూముల పరిశీలన

    అక్షర టుడే, ఎల్లారెడ్డి : Yellareddy | మండలంలోని వెల్లుట్ల (Vellutla) శివారులోని హేమగిరి ప్రాంతంలో గల అటవీ...

    KALOJI | తెలంగాణ బతుకుకు వన్నెతెచ్చిన కవి కాళోజీ

    అక్షరటుడే, ఎల్లారెడ్డి: KALOJI | తెలంగాణ బతుకుకు వన్నెతెచ్చిన కవి కాళోజీ అని ఎల్లారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల...