ePaper
More
    HomeతెలంగాణLoan Waiver | రుణమాఫీ పేరిట మోసం.. రైతుల వేషంలో వెళ్లి షాకిచ్చిన పోలీసులు

    Loan Waiver | రుణమాఫీ పేరిట మోసం.. రైతుల వేషంలో వెళ్లి షాకిచ్చిన పోలీసులు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :Loan Waiver | రుణమాఫీ పేరిట రైతులను (Farmer crop loans) మోసం చేస్తున్న ముఠా సభ్యులను పోలీసులు అరెస్ట్ (Police Arrest)​ చేశారు.

    రాష్ట్రంలో తాము అధికారంలోకి వస్తే రూ.రెండు లక్షల వరకు పంట రుణాలు మాఫీ చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే రూ.రెండు లక్షలపైన లోన్​ ఉన్న వారికి రుణమాఫీ కాలేదు. అలాగే రూ.రెండు లక్షల లోపు ఉన్నవారిలో కూడా పలువురికి రుణమాఫీ కాకపోవడంతో వారు ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి వారికి తాము రుణాలు మాఫీ చేయిస్తామని ఓ ముఠా మోసాలకు పాల్పడుతోంది.

    ఆదిలాబాద్​ జిల్లా(Adilabad District)లో పలువురు మోసగాళ్లు గ్రామాలకు తిరుగుతూ రుణమాఫీ (Loan waiver) చేయిస్తామని రైతులను నమ్మిస్తున్నారు. రైతులు ప్రతి సంవత్సరం బ్యాంకు నుంచి రుణం తీసుకొని సకాలంలో చెల్లిస్తే, తిరిగి 20-30 శాతం అధిక రుణం పొందే సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పించింది. దీనిని ఆసరాగా చేసుకున్న కేటుగాళ్లు లోన్​ మాఫీ చేయిస్తామని రైతులకు చెబుతున్నారు. తీరా పాత రుణాన్ని వారే కట్టి కొత్తగా అధికంగా రుణం తీసుకుంటున్నారు. ఇందుకు గాను రైతుల నుంచి రూ. పది వేల వరకు కమీషన్​ తీసుకుంటున్నారు. అయితే రుణమాఫీ అయిందనుకొని రైతులు వారికి కమీషన్​ ఇస్తున్నారు.

    Loan Waiver | ఎస్పీ దృష్టికి వెళ్లడంతో ..

    రుణమాఫీ పేరిట రైతులను మోసం చేస్తున్న విషయం ఆదిలాబాద్​ ఎస్పీ అఖిల్ మహాజన్ (Adilabad SP Akhil Mahajan)​ దృష్టికి వెళ్లింది. దీంతో ఆయన పోలీసు సిబ్బందిని రైతుల వేషంలో బ్యాంకు(Bank)కు పంపించారు. రైతుల వేషంలో ఉన్న పోలీసులతో మోసగాళ్లు మంతనాలు జరపడంతో నిందితులను పక్కా ఆధారాలతో అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్, నార్నూర్, నేరడిగొండ, ఇచ్చోడ, బేల, తలమడుగు, బీంపూర్, మావల, ఇంద్రవెల్లి మండలాల్లో రైతులను మోసం చేస్తున్న 34 మంది కేటుగాళ్లను పోలీసులు అరెస్ట్​ చేశారు. ఇలాంటి మోసగాళ్ల పట్ల బ్యాంకు అధికారులు, రైతులు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సూచించారు.

    Latest articles

    Aditya Infotech | అదరగొట్టిన ‘ఆదిత్య’.. ఇన్వెస్టర్లను ముంచేసిన కాయ్‌టెక్స్‌

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Aditya Infotech | దేశీయ స్టాక్‌ మార్కెట్‌లో మంగళవారం మూడు కంపెనీలు లిస్టయ్యాయి. ఇందులో...

    Register Post | పోస్టల్ శాఖ సంచలన నిర్ణయం.. నిలిచిపోనున్న రిజిస్టర్​ పోస్ట్​ సేవలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Register Post | పోస్టల్​ శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. రిజిస్టర్​ పోస్ట్​ సేవలను నిలిపి...

    Deepika Padukone | రికార్డుల‌కెక్కిన దీపికా పదుకొనే.. ప్ర‌పంచంలోనే అత్య‌ధిక వ్యూస్ దాటిన ఆమె రీల్‌

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Deepika Padukone | బాలీవుడ్ నటి దీపికా పదుకొనే అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు....

    Harish Rao | బీఆర్​ఎస్​పై ఆ రెండు పార్టీలు కుట్ర చేస్తున్నాయి.. హరీశ్​రావు సంచలన వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Harish Rao | కాంగ్రెస్​, బీజేపీ కలిసి బీఆర్​ఎస్​పై కుట్ర చేస్తున్నాయని మాజీ మంత్రి...

    More like this