అక్షరటుడే, వెబ్డెస్క్ : CM OSD | సైబర్ నేరగాళ్లు cyber criminals రెచ్చిపోతున్నారు. ఏకంగా ప్రముఖుల పేరిట మోసాలకు పాల్పడుతున్నారు.
సీఎం ఓఎస్డీ cm osd పేరిటే వ్యాపారులకు మెయిల్స్ mails పంపుతున్నారు. ముఖ్యమంత్రి ఓఎస్డీ పేరిట వ్యాపారులను మోసం చేస్తున్న వారిపై తెలంగాణ పోలీసులు telangana police కేసు నమోదు చేశారు. సైబర్ నేరగాళ్లు సీఎం ఆఫీసు పేరుతో వ్యాపార సంస్థల యజమానులకు ఈ మెయిల్స్, వాట్సాప్ మెసేజ్‌లు పంపుతున్నారు.
రాపిడో rapido, గుప్తా gupta, బెకెం bekem, కంట్రీ డిలైట్ సంస్థలకు బెదిరింపు మెయిల్స్ పంపారు. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి స్పెషల్ సెక్రటరీ అజిత్ రెడ్డి cm special secretery Ajit Reddy పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.