అక్షరటుడే, వెబ్‌డెస్క్: Free Launch Scam | ఫ్రీ లాంచ్ పేరుతో రూ.300 కోట్ల మోసానికి పాల్పడిన నిందితుడిని ఈడీ అరెస్ట్ చేసింది. జయత్రి ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ కాకర్ల శ్రీనివాస్ (Kakarlala Srinivas)ను అధికారులు చెన్నైలో అరెస్ట్ చేసి హైదరాబాద్ తీసుకొచ్చారు.
రియల్ ఎస్టేట్ రంగం (Real Estate Sector)లో చాలా మంది మోసాలకు పాల్పడుతుంటారు. డబ్బులు తీసుకొని ప్లాట్లు, ఇళ్లు రిజిస్ట్రేషన్ చేయకుండా వేధిస్తారు. కొందరు పెద్ద పెద్ద వ్యాపారులు ఫ్రీ లాంచ్ ఆఫర్ల పేరిట అపార్ట్మెంట్లు కట్టకుముందే ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తారు. ముందుగా చెల్లించిన వారికి తక్కువ ధరకు ఫ్లాట్ ఇస్తామని నమ్మిస్తారు. దీంతో చాలా మంది డబ్బులు కడతారు. అయితే ఆ ప్రాజెక్ట్‌లు పూర్తి చేయకుండా డబ్బులు తీసుకొని కొందరు వ్యాపారులు పరారు అవుతుంటారు. జయత్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ సైతం ఇలాగే మోసం చేసింది.
Free Launch Scam | ఈడీ దూకుడు..
జయత్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ (Jayatri Infrastructures) ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీపై ఈడీ అధికారులు దర్యాప్తు వేగవంతం చేశారు. కంపెనీ ఎండీ కాకర్ల శ్రీనివాస్‌ను చెన్నైలో అరెస్టు చేశారు. కాగా తమను మోసం చేశారని బాధితులు ఫిర్యాదు చేయడంతో గతంలో తెలంగాణ పోలీసులు శ్రీనివాస్‌ను అరెస్ట్ చేశారు. అనంతరం బెయిల్‌పై బయటకు వచ్చిన ఆయన తర్వాత పరారీలో ఉన్నాడు. అయితే ఇదే వ్యవహారంలో మనీ లాండరింగ్ (Money Laundering) చట్టం కింద ఈడీ కేసు నమోదు చేసింది. ఇందులో భాగంగా తాజాగా ఆయనను అరెస్ట్ చేసింది.
ప్రీ-లాంచ్ ఆఫర్లు, భవిష్యత్ ప్రాజెక్టుల పేరుతో జయత్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎంతో మందిని మోసం చేసినట్లు సమాచారం. సుమారు రూ.300 కోట్లు వసూలు చేసి.. ప్రాజెక్టులు పూర్తి చేయకుండా, డబ్బులు తిరిగి ఇవ్వకుండా మోసాలకు పాల్పడింది. ఈ కేసులో ఈడీ గతంలో హైదరాబాద్ (Hyderabad)లోని 8 ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టింది. కీలక పత్రాలు స్వాధీనం చేసుకుంది. ప్రజల నుంచి సేకరించిన నిధులను డొల్ల కంపెనీల ద్వారా తరలించినట్లు అధికారులు గుర్తించారు.