Sirnapalli waterfall | వరదలో చిక్కుకున్న యువకులు.. సిర్నాపల్లి జలపాతం వద్ద ఘటన
Sirnapalli waterfall | వరదలో చిక్కుకున్న యువకులు.. సిర్నాపల్లి జలపాతం వద్ద ఘటన

అక్షరటుడే, ఇందల్వాయి: Sirnapalli : రాష్ట్రంలో గత మూడు రోజులుగా భారీగా వర్షాలు heavy rains కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. నిజామాబాద్​ జిల్లా Nizamabad district ఇందల్​వాయి మండలం సిర్నాపల్లి గ్రామంలో ఇందూరు నయాగారా Niagara గా పేరొందిన చీలం జానకీబాయి చెరువు Chilam Janakibai lake అలుగు పొంగిపొర్లుతోంది.

Sirnapalli waterfall : ఒక్కసారిగా పెరిగిన వరద ఉద్ధృతి..

కాగా, అలుగు అందాలు తిలకిస్తూ.. జల సవ్వడులను ఆస్వాదించేందుకు శనివారం (జులై 26) సాయంత్రం పలువురు యువకులు చెరువు వద్దకు చేరుకున్నారు. జలధార కింద సరదాగా ఆడుతూ ఉండిపోయారు. అయితే, అదే సమయంలో నీటి ఉద్ధృతి water level పెరగడంతో నలుగురు యువకులు వరదలో చిక్కుపోయారు. వారికి బయటకు వచ్చే దారి లేకుండా పోయింది.

Sirnapalli waterfall | వరదలో చిక్కుకున్న నలుగురు యువకులు.. సిర్నాపల్లి చీలం జానకీబాయి జలపాతం వద్ద ఘటన
Sirnapalli waterfall | వరదలో చిక్కుకున్న నలుగురు యువకులు.. సిర్నాపల్లి చీలం జానకీబాయి జలపాతం వద్ద ఘటన

Sirnapalli waterfall : సాయం కోసం కేకలు..

జలధార ఉద్ధ్రతికి వరద flood లో చిక్కుపోయిన యువకులు పెద్ద బండరాయిపైకి చేరుకున్నారు. సాయం కోసం కేకలు వేశారు. దీంతో ఒడ్డున ఉన్నవారు వారిని కాపాడే ప్రయత్నం చేశారు. అందుకు అవకాశం లేకపోవడంతో పరుగున సమీపంలోని సిర్నాపల్లికి వెళ్లారు. అక్కడి ఊరి వారికి విషయాన్ని చేరవేశారు. వారి ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు సిర్నాపల్లికి చేరుకున్నారు. కానీ, చెరువు వద్దకు చేరుకునే పరిస్థితి లేకుండా పోయింది.

Sirnapally
Sirnapalli waterfall | వరదలో చిక్కుకున్న నలుగురు యువకులు.. సిర్నాపల్లి చీలం జానకీబాయి జలపాతం వద్ద ఘటన

దీంతో ట్రాక్టర్ tractor ​లో చీలం జానకీబాయి చెరువు వద్దకు వెళ్లారు. ట్రాక్టర్​లో బోటును తీసుకెళ్లారు. కానీ, అలుగు వాగు మధ్య పెద్ద పెద్ద బండరాళ్లు ఉండటంతో బోటు వెళ్లే పరిస్థితి లేకుండాపోయింది. దీంతో పెద్ద తాళ్లు తెప్పించారు. వాటి అతికష్టం మీద చివరికి వరదలో చిక్కుకున్న నలుగురు యువకులను బయటకు తీసుకొచ్చారు. ప్రస్తుతం ఆ నలుగురు యువకులు కూడా క్షేమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.