అక్షరటుడే, వెబ్డెస్క్: Building Collapses | దేశ రాజధాని ఢిల్లీ(Delhi)లో విషాదం చోటు చేసుకుంది. శనివారం ఉదయం నాలుగు అంతస్తుల భవనం(Building Collapses) ఒక్కసారిగా కుప్పకూలింది. భవనం కూలడంతో శిథిలాల కింద చిక్కుకున్న నలుగురిని స్థానికులు రక్షించి ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న అధికారులు, అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపడుతున్నారు.
నార్త్ ఈస్ట్ ఢిల్లీలోని శీలంపూర్ జనతా మజ్దూర్ కాలనీ (Sheelampur Janata Mazdoor Colony)లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో భవనంలో ఎంత మంది ఉన్నారనేది తెలియరాలేదు. దీంతో భవనం శిథిలాల కింద పలువురు చిక్కుకొని ఉంటారని అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు సహాయక చర్యలు చేపడుతున్నారు.
కాగా శుక్రవారం తెల్లవారు జామున ఢిల్లీలోని ఆజాద్ మార్కెట్ ప్రాంతంతో ఓ భవనం కూలిపోయింది. ఆ ఘటన జరిగిన మరుసటి రోజే మరో నాలుగు అంతస్తుల బిల్డింగ్ కూలిపోవడం గమనార్హం. ఆజాద్ మార్కెట్లో బిల్డింగ్ కూలిపోవడంతో ఓ వ్యక్తి మరణించాడు.