అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Nizamabad City | న్యూసెన్స్ చేసి శాంతి భద్రతలకు విఘాతం కలిగించిన నలుగురికి న్యాయస్థానం నాలుగు రోజుల జైలు శిక్ష విధించింది.
ఒకటో టౌన్ ఎస్‌హెచ్‌వో రఘుపతి (SHO Raghupathi) తెలిపిన వివరాల ప్రకారం.. ఈనెల 23న అర్ధరాత్రి బస్టాండ్ ఎదురుగా ఉన్న సాయి మెస్‌లో (Sai Mess) నగరానికి చెందిన జంగిటి విశాల్, బజ్జుల్వర్ గోవింద్, సందనాల సాయికుమార్, కాలే నవనాథ్ న్యూసెన్స్ (Nuisance) చేసి శాంతి భద్రతలకు ఆటంకం కలిగించారు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వారిని అదుపులోకి తీసుకుని సిటీ పోలీస్‌యాక్ట్ (City Police Act) కింద కేసు నమోదు చేశారు. అనంతరం వారిని స్పెషల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ (Special Second Class Magistrate) ఎదుట హాజరుపర్చగా ఒక్కొక్కరికి నాలుగురోజుల చొప్పున జైలుశిక్ష విధించారు.
Nizamabad City | న్యూసెన్స్ చేస్తే కఠినచర్యలు
నగరంలో రద్దీ ఉండే ప్రాంతాల్లో న్యూసెన్స్ చేస్తూ ఇబ్బంది కలిగిస్తే కఠినచర్యలు తీసుకుంటామని ఎస్‌హెచ్‌వో పేర్కొన్నారు. సీపీ సాయిచైతన్య (CP Sai Chaitanya) ఆదేశాల మేరకు హోటళ్లన్నీ సమయానుసారం మూసివేయాలని.. రాత్రివేళ్లలో సరైన కారణం లేకుండా రోడ్లపై తిరిగితే నిబంధనల ప్రకారం చర్యలుంటాయని ఆయన స్పష్టం చేశారు.