అక్షరటుడే, నిజామాబాద్‌సిటీ: Drunk drive | మద్యం తాగి వాహనాలు నడిపిన కేసులో నలుగురికి జైలు, మరో 9 మందికి జరిమానా విధించినట్లు ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ (Traffic ACP Mastan Ali) తెలిపారు.
ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. ఇటీవల నగరంలో(Nizmabad City) వాహన తనిఖీల్లో 13 మంది పట్టుబడగా, బుధవారం కౌన్సిలింగ్ అనంతరం వారిని కోర్టులో హాజరు పరిచినట్లు పేర్కొన్నారు. దీంతో విచారించిన న్యాయస్థానం కాలూర్‌కు చెందిన ముత్యాల విజయ్, బోధన్‌కు చెందిన శేఖర్, ఖానాపూర్నకు చెందిన మాషణకు రెండు రోజుల జైలు శిక్ష విధించారు. అలాగే మల్లారం గ్రామానికి చెందిన పిట్ల అనిల్ కుమార్‌కు మూడు రోజుల జైలు శిక్ష విధించినట్లు వెల్లడించారు. మరో 9 మందికి రూ.13వేల జరిమానా విధించినట్లు చెప్పారు.