అక్షరటుడే, వెబ్‌డెస్క్ : High Court | తెలంగాణ (Telangana) హైకోర్టులో (High Court) నలుగురు కొత్త జడ్జిల నియామకానికి కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ మేరకు సుప్రీంకోర్టు (Supreme Court) కొలీజియం సిఫారసులను సోమవారం ఆమోదించింది. దీంతో రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము (President Draupadi Murmu) ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులుగా గాడి ప్రవీణ్‌కుమార్, చలపతిరావు, వాకిటి రామకృష్ణారెడ్డి, గౌస్ మీరా మొహుద్దీన్ నియమితలయ్యారు. వీరు త్వరలోనే ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
తెలంగాణ హైకోర్టుకు మొత్తం 42 మంది న్యాయమూర్తులను మంజూరు చేశారు. అయితే ఇప్పటి వరకు 26 మంది మాత్రమే ఉన్నారు. తాజాగా మరో నలుగురిని నియమించడంతో జడ్జిల సంఖ్య 30కి చేరింది. మంజూరైన పోస్టులలో ఇంకా 12 ఖాళీగా ఉన్నాయి. కాగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఇటీవల అపరేష్ కుమార్ సింగ్ (Aparesh Kumar Singh) నియమితులైన విషయం తెలిసిందే.