Homeక్రైంCrackers Blast | టపాసులు పేలి నలుగురు మృతి

Crackers Blast | టపాసులు పేలి నలుగురు మృతి

Crackers Blast | ఇంట్లో నిల్వ ఉంచిన టపాసులు పేలి నలుగురు మృతి చెందారు. ఈ ఘటన తమిళనాడులోని చెన్నై సమీపంలో చోటు చేసుకుంది.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Crackers Blast | ఇంట్లో నిల్వ ఉంచిన టపాసులు పేలి నలుగురు మృతి చెందారు. ఈ ఘటన తమిళనాడు (Tamil Nadu)లో చోటు చేసుకుంది.

చెన్నై (Chennai)లోని అవడి సమీపంలోని దండురైలో ఆదివారం విషాద సంఘటన జరిగింది. ఇంట్లో నిల్వ ఉంచిన క్రాకర్స్​ పేలాయి. తిరువళ్లూరు జిల్లాలోని పట్టాభిరామ్ ప్రాంతంలోని ఒక ఇంట్లో పేలుడు సంభవించింది. అక్కడ దీపావళి(Diwali) వేడుకలకు ముందు పటాకులు అమ్ముతున్నట్లు సమాచారం. ఈ పేలుడు ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. ఆ ప్రాంతంలో పెద్ద శబ్దం రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సునీల్ ప్రకాష్, యాసిన్ అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు ఆస్పత్రికి తరలిస్తుండగా చనిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్ని మాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకున్నారు. ఫైరింజన్లతో మంటలను ఆర్పివేశారు.

Crackers Blast | జాగ్రత్తలు తప్పనిసరి

దీపావళి వచ్చిందంటే దీపాల వెలుగులు, టపాసుల మోతతో దద్దరిల్లుతోంది. ఆకాశంలో పేలే టపాసులు రంగురంగుల కాంతులతో ఆకట్టుకుంటాయి. అయితే దీపావళి టపాసులు ఉత్సాహంతో పాటు ఏటా విషాదాన్ని కూడా నింపుతాయి. దీంతో టపాసుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. దేశంలోని పలు ప్రాంతాల్లో ఈ నెలలో టపాసులు పేలి పదుల సంఖ్యలో ప్రజలు మరణించారు. టపాసుల తయారీ కేంద్రాలు, నిల్వ చేసిన ప్రాంతాల్లో ఎక్కువగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. దేశవ్యాప్తంగా సోమవారం దీపావళి వేడుకలను ఘనంగా జరుపుకోనున్నారు. ఈ క్రమంలో టపాసులు విక్రయించే వారు జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించారు. జనావాసాలకు దూరంగా టపాసుల దుకాణాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు.

Crackers Blast | తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి

ప్రతి ఏటా దీపావళి సందర్భంగా వందలాది మంది గాయాలపాలు అవుతుంటారు. ముఖ్యంగా చిన్న పిల్లలు పటాకులు కాల్చే సమయంలో ప్రమాదాల బారీన పడతారు. హైదరాబాద్ (Hyderabad)​ నగరంలోని సరోజిని దేవి కంటి ఆస్పత్రి (Sarojini Devi Eye Hospital)కి ప్రతి దీపావళి తర్వాత రోజు వందల సంఖ్యల్లో రోగులు వస్తారు. పటాసులు కాల్చే సమయంలో కంటికి గాయాలైన వారే అధికంగా ఉంటారు. ఈ క్రమంలో పిల్లలు పటాసులు కాల్చే సమయంలో తల్లిదండ్రులు పర్యవేక్షించాలని అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా పెద్ద పెద్ద క్రాకర్స్​ కాకుండా చిన్నవి వారికి ఇవ్వాలని చెబుతున్నారు.