ePaper
More
    HomeజాతీయంBank Holidays | ఈ వారంలో నాలుగు రోజులు బ్యాంకులు బంద్.. కార‌ణం ఏంటంటే..!

    Bank Holidays | ఈ వారంలో నాలుగు రోజులు బ్యాంకులు బంద్.. కార‌ణం ఏంటంటే..!

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Bank Holidays | దేశంలోని పలు నగరాల్లో బ్యాంకులు నాలుగు రోజులు బంద్ అనే విష‌యం తెలిసి చాలా మందిలో ఆందోళన నెల‌కొంది. నిన్న ఆదివారం కావ‌డంతో ఈ రోజు ప‌నులు చక్క‌బెట్టుకోవాల‌ని చాలా మంది భావించ‌గా, వారికి పెద్ద షాక్ త‌గిలింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Reserve Bank of India) ప్రకటించిన సెలవుల జాబితా ప్రకారం, ఆగస్టు 25 నుండి 31వ తేదీ వ‌ర‌కు వివిధ కారణాలతో బ్యాంకులు మూసివేయబడతాయి. అయితే ఈ సెలవులు రాష్ట్రానికీ, నగరాన్ని బ‌ట్టి మారుతాయ‌ని అధికారులు పేర్కొన్నారు. ఆగస్టు 25 (సోమవారం)..గౌహతిలో మహాపురుష శ్రీమంత శంకరదేవ వర్ధంతి* సందర్భంగా బ్యాంకులు బంద్.

    Bank Holidays | ప్లాన్ చేసుకోండి..

    ఆగస్టు 27 (బుధవారం) రోజు గణేశ్ చతుర్థి(Ganesh Chaturthi) పండుగ కారణంగా ముంబై, బేలాపూర్, నాగ్‌పూర్, భువనేశ్వర్, చెన్నై, హైదరాబాద్, విజయవాడ, పనాజీ వంటి నగరాల్లో బ్యాంకులు మూసివేయబడతాయి. ఆగస్టు 28న భువనేశ్వర్ మరియు పనాజీ నగరాల్లో గణేశ్ ఉత్సవానికి సంబంధించి బ్యాంకులు బంద్(Bank Holidays). ఇక ఆగస్టు 31 (ఆదివారం) కావడంతో దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు సాధారణ సెలవు. ఈ సెలవుల సమయంలో ఆన్‌లైన్ బ్యాంకింగ్, నెట్ బ్యాంకింగ్, UPI సేవలు,(UPI Services)  వంటి డిజిటల్ సేవలు యథావిధిగా అందుబాటులో ఉంటాయి. కాబట్టి అవసరమైన బ్యాంకింగ్ పనులు ముందు గానే పూర్తి చేసుకోవడం ఉత్తమం.

    RBI విడుదల చేసిన ప్రాదేశిక సెలవుల జాబితాను అనుసరించి బ్యాంకుల కార్యకలాపాలు మారవచ్చు. కాబట్టి మీ ప్రాంతానికి సంబంధించి సంబంధిత బ్యాంక్ అధికార వెబ్‌సైట్‌ లేదా బ్రాంచ్‌ ద్వారా సమాచారం పొందడం మంచిది. చెల్లింపులు, డ్రాఫ్ట్‌లు, నగదు డిపాజిట్లు వంటి కీలక పనులను ముందుగానే పూర్తి చేసుకోవాలని బ్యాంకింగ్ నిపుణులు సూచిస్తున్నారు. మ‌రోవైపు ఆన్‌లైన్ లావాదేవీలు (Online Transactions)చేసే స‌మ‌యంలో చాలా మంది సైబ‌ర్ నేర‌గాళ్ల బారిన ప‌డి ల‌క్ష‌లు ల‌క్ష‌లు కోల్పోతున్నారు. కాబ‌ట్టి ఆన్‌లైన్ ట్రాన్సాక్ష‌న్స్ చేసేట‌ప్పుడు సురక్షితంగా చేయండి అని ఎన‌లిస్ట్స్ చెప్పుకొస్తున్నారు.

    Latest articles

    Hyderabad Marathon | ఎన్ఎండీసీ హైదరాబాద్ మారథాన్ భాగస్వామిగా ఏసిక్స్

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Hyderabad Marathon | ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన జపనీస్ స్పోర్ట్స్ వేర్ బ్రాండ్ (Japanese...

    BJP Nizamabad | ఇందూరుకు చేరుకున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు

    అక్షరటుడే ఇందల్వాయి: BJP Nizamabad | బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు (BJP chief Ramachandra Rao) జిల్లాకు...

    chit fund | చిట్​ఫండ్​ ముసుగులో వడ్డీ దందా.. అడ్డంగా దొరికిన వ్యాపారి

    అక్షరటుడే, ఇందూరు: chit fund : నిజామాబాద్​ కమిషనరేట్ పోలీసులు తాజాగా వడ్డీ వ్యాపారుల ఇళ్లలో సోదాలు చేపట్టారు....

    Harish Rao | తెలంగాణ‌లో ఎమ‌ర్జెన్సీ అమ‌లు.. ఓయూ విద్యార్థుల అరెస్టుల‌పై హ‌రీశ్ ఫైర్‌

    అక్షరటుడే, వెబ్​బెస్క్ : Harish Rao | ఉస్మానియా యూనివ‌ర్సిటీలో ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి ప‌ర్య‌ట‌న నేప‌థ్యంలో విద్యార్థుల‌ను ముంద‌స్తు...

    More like this