అక్షరటుడే, వెబ్‌డెస్క్: Stock Markets | డాలర్‌తో రూపాయి (Rupee) మారకం విలువ వరుసగా మూడో సెషన్లోనూ బలపడిరది. శుక్రవారం సెషన్లో ఏకంగా 1.14 శాతం బలపడడంతో ఇన్వెస్టర్లలో సెంటిమెంట్ బలపడిరది. ఎఫ్ఐఐలు సైతం నికర కొనుగోలుదారులుగా నిలుస్తుండడంతో మార్కెట్లు కోలుకున్నాయి.
శుక్రవారం ఉదయం సెన్సెక్స్ 275 పాయింట్ల లాభంతో ప్రారంభమై 22 పాయింట్లు తగ్గింది. అక్కడినుంచి పుంజుకుని మరో 333 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ(Nifty) 96 పాయింట్ల లాభంతో మొదలై 31 పాయింట్లు పడిపోయినా కోలుకుని 99 పాయింట్లు ఎగబాకింది. చివరికి సెన్సెక్స్(Sensex) 447 పాయింట్ల లాభంతో 84,929 వద్ద, నిఫ్టీ 150 పాయింట్ల లాభంతో 25,966 వద్ద స్థిరపడ్డాయి.
Stock Markets | అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..
బీఎస్ఈ(BSE)లో నమోదైన కంపెనీలలో 2,731 కంపెనీలు లాభపడగా 1,445 స్టాక్స్ నష్టపోయాయి. 155 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 100 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 179 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి. 16 కంపెనీలు అప్పర్ సర్క్యూట్‌ను, 9 కంపెనీలు లోయర్ సర్క్యూట్‌ను తాకాయి.
Stock Markets | అన్ని రంగాలు గ్రీన్‌లోనే..
బీఎస్ఈలో అన్ని ప్రధాన రంగాల ఇండెక్స్‌లు లాభాలతో ట్రేడ్ అయ్యాయి. రియాలిటీ 1.65 శాతం, క్యాపిటల్ గూడ్స్ 1.65 శాతం, టెలికాం(Telecom) 1.54 శాతం, ఇండస్ట్రియల్ 1.49 శాతం, ఇన్ఫ్రా 1.34 శాతం, యుటిలిటీ 1.25 శాతం, పవర్ 1.24 శాతం, ఆటో ఇండెక్స్ 1.24 శాతం, హెల్త్‌కేర్ ఇండెక్స్ 1.14 శాతం, పీఎస్‌యూ(PSU) 0.89 శాతం, ఎనర్జీ 0.87 శాతం లాభంతో ముగిశాయి. స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1.26 శాతం, మిడ్ క్యాప్ ఇండెక్స్ 1.25 శాతం, లార్జ్ క్యాప్ ఇండెక్స్ 0.65 శాతం లాభంతో ముగిశాయి.
Stock Markets | Top gainers..
బీఎస్ఈ సెన్సెక్స్‌లో 26 కంపెనీలు లాభాలతో ఉండగా.. 4 కంపెనీలు నష్టాలతో సాగుతున్నాయి. బీఈఎల్ 2.37 శాతం, పవర్‌గ్రిడ్ 2.25 శాతం, టీఎంపీవీ 1.98 శాతం, ఆసియన్ పెయింట్ 1.41 శాతం, రిలయన్స్ 1.34 శాతం పెరిగాయి.
Stock Markets | Losers..
హెచ్‌సీఎల్ టెక్ 1.14 శాతం, కొటక్ బ్యాంక్ 0.27 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ 0.20 శాతం, సన్‌ఫార్మా 0.02 శాతం నష్టపోయాయి.