అక్షరటుడే, బోధన్: Bodhan Transco | పట్టణ శివారులోని ఆచంపల్లి వద్ద 33/11 కేవీ విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణానికి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి (Bodhan MLA Sudarshan Reddy) గురువారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రూ.2.21 కోట్ల వ్యయంతో విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మించనున్నట్లు పేర్కొన్నారు.
పదేళ్లుగా బోధన్ అభివృద్ధికి నోచుకోలేదని, కాంగ్రెస్తోనే అభివృద్ధి సాధ్యమన్నారు. కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ (Urdu Academy) ఛైర్మన్ తాహెర్బిన్ హందాన్ (Taher bin Hamdan), జిల్లా గ్రంథాలయ సంస్థ (District Library Association) ఛైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, డీసీసీ అధికార ప్రతినిధి గంగాశంకర్, ట్రాన్స్కో ఎస్ఈ రాపల్లి రవీందర్, బోధన్ డీఈ మహమ్మద్ ముక్తార్, కన్స్ట్రక్షన్ డీఈ వెంకటరమణ, ఏడీఈ కన్స్ట్రక్షన్స్ తోట రాజశేఖర్, ఏడీఈ నగేష్ కుమార్, ఏఈ సుమిత, టౌన్ ఏఈ నాయిని కృష్ణ, ఏసీపీ శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ కృష్ణ జాదవ్, తహశీల్దార్ విఠల్, శరత్ రెడ్డి, పులి శ్రీనివాస్, పాషాభాయ్, గంగా శంకర్, దామోదర్, ఆచన్పల్లి గ్రామస్థులు సిబ్బంది పాల్గొన్నారు.