అక్షరటుడే, ఎల్లారెడ్డి : Yellareddy | ఎల్లారెడ్డి మండలం కళ్యాణి గ్రామం (Kalyani Village)లో 2.5 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న హైలెవల్ వంతెనకు ఎమ్మెల్యే మదన్ మోహన్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళ్యాణి–రత్నాపూర్ గ్రామాలను కలుపుతూ బ్రిడ్జి నిర్మాణం (Bridge Construction) కోసం స్థానిక ప్రజలు గత 30 ఏళ్లుగా ఎదురుచూస్తున్నారన్నారు.
వంతెన లేకపోవడంతో ఎన్నో కుటుంబాలు ఇబ్బందులు పడ్డాయన్నారు. ‘గడప గడపకు’ పాదయాత్ర సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీ నేరవేర్చానని తెలిపారు. వంతెన నిర్మాణ పనులు ప్రారంభమైన నేపథ్యంలో గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు. ఏళ్లనాటి స్వప్నం నిజం అవుతుందన్న విశ్వాసంతో ఎమ్మెల్యే మదన్ మోహన్ (MLA Madan Mohan)కు కృతజ్ఞతలు తెలిపారు. పనులు సకాలంలో పూర్తిచేసి ప్రజల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులు, గుత్తేదారులను ఆయన ఆదేశించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ ఛైర్మన్ రజిత వెంకట్రామిరెడ్డి, మాజీ జెడ్పీటీసీ సామెల్, మాజీ మున్సిపల్ ఛైర్మన్ కుడుముల సత్యనారాయణ, సంజీవులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.