అక్షర టుడే, కమ్మర్‌పల్లి: Kammarpally | మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో (Kasturibha Gandhi Balika Vidyalayam) పలు అభివృద్ధి పనులకు ఏఎంసీ ఛైర్మన్ పాలెపు నర్సయ్య భూమిపూజ చేశారు. మరుగుదొడ్లు, పాఠశాల ఆవరణలో సీసీ, డైనింగ్ హాల్, తదితర పనులను సోమవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాఠశాలలో అభివృద్ధి పనులకు రూ.15 లక్షలు మంజూరు చేయించిన కాంగ్రెస్ బాల్కొండ నియోజకవర్గ ఇన్‌ఛార్జి సునీల్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగ (education sector) అభివృద్ధికి ఎంతో కృషి చేస్తోందన్నారు. విద్యార్థులకు మెస్‌ఛార్జీలు రూ.200కు పెంచిందని వివరించారు. పౌష్టికాహారంతో పాటు పాఠశాలల ప్రారంభానికి ముందే పాఠ్య పుస్తకాల అందిస్తున్నామన్నారు.
కార్యక్రమంలో ఏఎంసీ వైస్ ఛైర్మన్ సుంకెట బుచ్చన్న, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సుంకెట రవి, గ్రామ అధ్యక్షుడు సల్లూరి గణేష్, మాజీ ఎంపీటీసీ గుడిసె అంజమ్మ, నాయకులు మల్లయ్య, గంగారెడ్డి, లక్ష్మణ్, కిషన్, రాజేశ్వర్, రంజిత్, శైలేందర్, నాగరాజ్, జగదీష్, దీపక్, రమణ, శ్రీనివాస్ పాల్గొన్నారు.
