Homeజిల్లాలుకామారెడ్డిMla Madan Mohan Rao | అభివృద్ధి పనులకు శంకుస్థాపన

Mla Madan Mohan Rao | అభివృద్ధి పనులకు శంకుస్థాపన

- Advertisement -

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Mla Madan Mohan Rao | నియోజకవర్గంలోని ఎల్లారెడ్డి, లింగంపేట్ (Lingampet), నాగిరెడ్డిపేట(Nagireddypet), సదాశివనగర్‌ (Sadashiva Nagar), మండలాల్లో రూ.80 కోట్లతో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు సోమవారం శంకుస్థాపనలు చేశారు. ఆయా మండలాల్లో బీటీ రోడ్లు, గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు.

ఎల్లారెడ్డి (Yellareddy) మండలంలోని శివపూర్, మల్లయ్యపల్లి, అల్మాజిపూర్, బాయంపల్లి గ్రామాల్లో నూతన గ్రామపంచాయతీ భవనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ప్రజలు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. వెంకటాపూర్‌లో ఎమ్మెల్యేను ఎడ్లబండిపై ఆహ్వానించారు. కార్యక్రమంలో ఏఎంసీ ఛైర్‌పర్సన్‌ రజిత విల్సన్‌ వెంకటరామిరెడ్డి, కురుమ సాయిబాబా, సత్యనారాయణ, శ్రీనివాస్‌ రెడ్డి, సంతోష్‌ రెడ్డి, శ్రీకాంత్‌ రెడ్డి, కృష్ణగౌడ్, సాయిలు, తదితరులు పాల్గొన్నారు.

Must Read
Related News