అక్షరటుడే, ఆర్మూర్: Armoor town | ఆర్మూర్ పట్టణంలోని పలు వార్డుల్లో బీటీ, సీసీ రోడ్లకు బుధవారం ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి (MLA Paidi Rakesh Reddy) శంకుస్థాపన చేశారు. రూ. 27 కోట్ల టీయూఎఫ్ఐడీసీ నిధులతో (TUFIDC funds) చేపట్టనున్న పనులకు అంగడి బజార్లో శంకుస్థాపన నిర్వహించారు.
ఈ సందర్భంగా సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధిక ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందన్నారు. రవాణా వ్యవస్థను మెరుగు పర్చేందుకు పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తోందని చెప్పారు. కార్యక్రమంలో తెలంగాణ కో-ఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ ఛైర్మన్ మానాల మోహన్ రెడ్డి, కాంగ్రెస్ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జి వినయ్ కుమార్ రెడ్డి, ఉర్దూ అకాడమీ ఛైర్మన్ తాహెర్ బిన్ హందాన్, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి, కాంగ్రెస్ ఆర్మూర్ పట్టణ అధ్యక్షుడు, ఏఎంసీ ఛైర్మన్ సాయిబాబా గౌడ్, నాయకులు పండిత్ పవన్, అయ్యప్ప శ్రీనివాస్, షేక్ మున్ను, లింగా గౌడ్, మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ జీవన్, మున్సిపల్ కమిషనర్ రాజు, బీజేపీ, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.