ePaper
More
    HomeతెలంగాణFormula E car race | ఫార్ములా ఈ‌‌‌‌‌‌‌‌–కారు​ రేస్ కేసు.. కేటీఆర్​కు మరోసారి ఏసీబీ...

    Formula E car race | ఫార్ములా ఈ‌‌‌‌‌‌‌‌–కారు​ రేస్ కేసు.. కేటీఆర్​కు మరోసారి ఏసీబీ నోటీసులు..

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Formula E car race | ఫార్ములా ఈ–కారు రేస్ కేసులో కేటీఆర్​కు (KTR) మరోసారి నోటీసులు జారీ అయ్యాయి. రెండోసారి విచారణకు హాజరు కావాలని ఏసీబీ (ACB) శుక్రవారం నోటీసులిచ్చింది. ఫార్ములా ఈ–కారు రేస్ కేసులో సోమవారం ఉదయం 10 గంటలకు విచారణకు రావాలని పేర్కొంది. కేసీఆర్‌ హయాంలో హైదరాబాద్‌ వేదికగా ఫార్ములా ఈ రేస్‌ నిర్వహించారు. అయితే, ఇందులో అక్రమాలు జరిగాయని, అనుమతి లేకుండా నిధులు విడుదల చేశారనే అభియోగంపై ఏసీబీ విచారణ చేస్తోంది. ఈ కేసుకు సంబంధించి గత నెల మే 28న విచారణకు హాజరుకావాల్సిందిగా ఏసీబీ కేటీఆర్​కు నోటీసులు పంపింది. అయితే ఆ సమయంలో కేటీఆర్ అమెరికా పర్యటనలో ఉన్నారు. ఈ నేపథ్యంలో విదేశీ పర్యటన ముగిసిన తర్వాత విచారణకు హాజరువుతానని ఏసీబీకి మాజీ మంత్రి సమాచారం ఇచ్చారు. అందుకు అంగీకరించిన అవినీతి నిరోధక శాఖ.. శుక్రవారం మరోసారి కేటీఆర్​కు నోటీసులు పంపింది.

    Formula E car race | గతంలో విచారణకు ఆదేశించిన ప్రభుత్వం

    ఫార్ములా-ఈ కార్​ రేసు (Formula E car race) వ్యవహారంలో ఉల్లంఘనలు జరిగాయని భావించిన రాష్ట్ర ప్రభుత్వం (state governmen) విచారణకు ఆదేశించారు. పోటీ నిర్వహణ సంస్థకు ఏకపక్షంగా చెల్లింపులు జరగడం, రిజర్వ్ బ్యాంకు అనుమతి లేకుండానే విదేశీ సంస్థకు నిధుల బదిలీ చేయడంతో విచారణ చేయించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఏసీబీకి లేఖ రాయడంతో కేసును అవినీతి నిరోధక శాఖ (Anti-Corruption Department) విచారిస్తోంది.

    Formula E car race | 2023లో పోటీలు

    2023 సంవత్సరంలో రాష్ట్ర రాజధాని హైదరాబాద్​లో (Hyderabad) ఫార్ములా–ఈ కార్​ రేసు పోటీలు జరిగాయి. హుస్సేన్ సాగర్ చుట్టూ ఏర్పాటు చేసిన 2.8 కిలోమీటర్ల ట్రాక్​లో 2023 ఫిబ్రవరి 10,11 తేదీల్లో మొదటి ఫార్ములా-ఈ కార్​ రేసు జరిగింది. ఈ పోటీలకు దేశ వ్యాప్తంగా అభిమానులు హాజరయ్యారు. దీంతో 2024 ఫిబ్రవరి 10న మరో మారు నిర్వహించాలని భావించారు. అయితే 2023 డిసెంబర్​లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ (Congress party) అధికారంలోకి వచ్చింది. ఒప్పందంలో పేర్కొన్న అంశాలను పాటించకపోవడంతో తాము హైదరాబాద్ రేస్ నుంచి తప్పుకొంటున్నట్లు అదే నెలలో ఫార్ములా-ఈ ఆపరేషన్స్ ప్రకటించింది.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...