అక్షరటుడే, బాన్సువాడ: Banswada | మంత్రి తుమ్మల నాగేశ్వరరావును (Minister Tummala Nageswara Rao) బీర్కూర్ మాజీ జెడ్పీటీసీ ద్రోణవల్లి సతీష్(Dronavalli Satish) మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సోమవారం ఆయనను శాలువతో సత్కరించారు.
అనంతరం బోధన్ ఎమ్మెల్యే, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డిని (Government Advisor Sudarshan Reddy) ఆయన నివాసంలో భేటీ అయ్యారు. అనంతరం సుదర్శన్ రెడ్డిని కూడా శాలువతో సన్మానించారు. నియోజకవర్గ అభివృద్ధి అంశాలపై మంత్రి, ఎమ్మెల్యేతో పలు విషయాలను సతీష్ ప్రస్తావించారు.
స్థానిక సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మిర్జాపూర్ సింగిల్ విండో ఛైర్మన్ రాంబాబు, బరంగేడ్గి మాజీ సర్పంచ్ గైని మారుతి, కిష్టాపూర్ మాజీ సర్పంచ్ దండు గంగాధర్, బైరాపూర్ మాజీ ఎంపీటీసీ అంజయ్య, స్వరూప శ్రీనివాస్ యాదవ్, సాయిరాం, తిమ్మాపూర్ మాజీ సర్పంచ్ రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
