Homeజిల్లాలునిజామాబాద్​Bajireddy Jagan | తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలి: మాజీ జడ్పీటీసీ జగన్​ డిమాండ్​

Bajireddy Jagan | తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలి: మాజీ జడ్పీటీసీ జగన్​ డిమాండ్​

తుపాను కారణంగా తడిసిపోయిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని మాజీ జడ్పీటీసీ సభ్యుడు బాజిరెడ్డి జగన్​ డిమాండ్​ చేశారు. ఇందల్వాయిలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు.

- Advertisement -

అక్షరటుడే, ఇందల్వాయి: Bajireddy Jagan | తడిసిన ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని మాజీ జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్ డిమాండ్ చేశారు. ఇందల్వాయి (Indalwai) మండల కేంద్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని (Paddy Centers) సోమవారం ఆయన పరిశీలించారు.

Bajireddy Jagan | రైతు కష్టం చూస్తే గుండె తరుక్కుపోతోంది..

మొంథా తుపాన్ ప్రభావంతో అకాల వర్షాల కారణంగా రైతులు తీవ్రగా నష్టపోయారని బాజిరెడ్డి జగన్​ పేర్కొన్నారు. కొందరు రైతులు పంట నూర్పిడి చేసి కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన తర్వాత ధాన్యం తడిసిపోయిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని కోరారు. రైతుల కష్టాలు చూస్తుంటే గుండె తరుక్కుపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఆయన వెంట బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు చిలువేరి గంగాదాస్, మాజీ ఎంపీటీసీ సుధాకర్, బీఆర్ఎస్ నాయకులు పాశం కుమార్, సాయిలు, గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.