అక్షరటుడే, వెబ్‌డెస్క్: వైరా మాజీ ఎమ్మెల్యే(Former wyra MLA), బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి(BRS party constituency in-charge) బానోతు మదన్‌లాల్ అనారోగ్యంతో మృతి చెందారు. నాలుగు రోజుల క్రితం అస్వస్తతకు గురైన ఆయన హైదరాబాద్(Hyderabad)లోని ఏఐజీ ఆస్పత్రి(AIG Hospital)లో చేరారు. చికిత్స పొందుతున్న తరుణంలో మంగళవారం ఉదయం గుండెపోటు రావడంతో కన్నుమూశారు.
తెలంగాణ(Telangana) వచ్చిన తర్వాత 2014లో జరిగిన తొలి అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన వైఎస్సార్ సీపీ(YSRCP) తరఫున పోటీ చేసి గెలుపొందారు. అనంతరం బీఆర్ఎస్ అధికారంలోకి రావడంతో ఆ పార్టీలో చేరిపోయారు. 2018, 2023 ఎన్నికల్లో elections బీఆర్ఎస్ తరఫున పోటీ చేసి ఓడిపోయారు.
Wyra Former MLA Madanlal : అస్వస్తతకు గురై..
గత వారం ఖమ్మంలోని తన నివాసంలో ఉన్న సమయంలో మదన్‌లాల్ అస్వస్తతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలు కావడంతో కుటుంబ సభ్యులు స్థానిక ఆస్పత్రిలో చేర్పించారు. మెరుగైన వైద్యం కోసం నాలుగు రోజుల క్రితం హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న తరుణంలో మంగళవారం ఉదయం గుండెపోటు రావడంతో కన్నుమూశారు. మదన్ లాల్ మృతితో వైరా నియోజకవర్గ వ్యాప్తంగా విషాదఛాయలు నెలకొన్నాయి. పలువురు మాజీ ప్రజా ప్రతినిధులు, బీఆర్ఎస్, ఇతర పార్టీల నాయకులు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.
Wyra Former MLA Madanlal : సంతాపం తెలిపిన కేసీఆర్..
మాజీ ఎమ్మెల్యే మదన్‌లాల్ మృతిపట్ల బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్BRS chief KCR సంతాపం వ్యక్తం చేశారు. మదన్‌లాల్ మృతి బీఆర్‌ఎస్‌కు తీరని లోటని పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మరోవైపు, మదన్‌లాల్ మృతిపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు261.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. వారి కుటుంబ సభ్యులకు దేవుడు మనోధైర్యం కలిగించాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సైతం సంతాపం తెలిపారు.