అక్షరటుడే, వెబ్‌డెస్క్: Shivraj Patil | కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి శివరాజ్ పాటిల్ (former Union Minister Shivraj Patil) (90) శుక్రవారం ఉదయం మృతి చెందారు. మహారాష్ట్రకు (Maharashtra) చెందిన ఆయన అనారోగ్య కారణాలతో లాతూర్‌లో తన నివాసం కన్నుమూశారు.
శివరాజ్ పాటిల్ తన జీవితాంతం కాంగ్రెస్ పార్టీలో (Congress Party) కొనసాగారు. కొన్నేళ్ల క్రితం నుంచి ఆయన క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఎల్లప్పుడూ మృదువుగా మాట్లాడే, అధ్యయనశీలి, స్పష్టమైన మనస్తత్వం కలిగిన రాజకీయ నాయకుడిగా కనిపిస్తారు. ఆయన 2004 నుంచి 2008 వరకు కేంద్ర హోం మంత్రిగా, 1991 నుంచి 1996 వరకు లోక్‌సభ స్పీకర్‌గా (Lok Sabha Speaker) పనిచేశారు. పంజాబ్ గవర్నర్‌గా, చండీగఢ్ కేంద్రపాలిత ప్రాంతానికి అడ్మినిస్ట్రేటర్‌గా కూడా పనిచేశారు.
Shivraj Patil | ఏడు సార్లు ఎంపీగా..
మహారాష్ట్రలో 1935 అక్టోబర్ 12న పాటిల్ జన్మించారు. లాతూర్ మునిసిపల్ కౌన్సిల్ చీఫ్‌గా తన రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించారు. 1970 ప్రారంభంలో ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం ఆయన ఏడుసార్లు లాతూర్ ఎంపీగా విజయం సాధించారు. 2004 లోక్‌సభ ఎన్నికల్లో ఆయన బీజేపీకి రూపతై పాటిల్ నీలంగేకర్ చేతిలో ఓడిపోయారు.
Shivraj Patil | ప్రధాని సంతాపం
శివరాజ్ పాటిల్ మృతిపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. శివరాజ్ పాటిల్ మరణం బాధాకరం. ఆయన అనుభవజ్ఞుడైన నాయకుడు, ప్రజా జీవితంలో తన సుదీర్ఘ కాలంలో ఎమ్మెల్యేగా, ఎంపీగా, కేంద్ర మంత్రిగా, మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌గా, లోక్‌సభకు కూడా పనిచేశారని పేర్కొన్నారు.