అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Chidambaram | కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం సంచలన వ్యాఖ్యలు చేశారు. యూపీఏ హయాంలో ముంబైలో పేలుళ్ల జరిగిన సమయంలో పాకిస్తాన్(Pakistan) పై చర్యలు చేపట్టేందుకు సిద్ధమైనప్పటికీ, అమెరికా ఒత్తిడి కారణంగా వెనుకడుగు వేసినట్లు వెల్లడించారు.
26/11 ముంబై ఉగ్రవాద దాడుల తర్వాత అంతర్జాతీయ ఒత్తిడి, ప్రధానంగా అమెరికా ఒత్తిడితో పాటు విదేశాంగ మంత్రిత్వ శాఖ వైఖరి కారణంగా తమ ప్రభుత్వం పాకిస్తాన్‌పై ప్రతీకారం తీర్చుకోకూడదని నిర్ణయించుకుందని తెలిపారు. ప్రతీకారం తీర్చుకోవాలని తాను వ్యక్తిగతంగా భావించానని, కానీ ప్రభుత్వం సైనిక చర్య తీసుకోకూడదని నిర్ణయించుకుందన్నారు. అయితే, ఆయన ప్రకటనపై బీజేపీ విమర్శలు ఎక్కుపెట్టింది.
Chidambaram | యుద్ధం వద్దని ప్రపంచం చెప్పింది..
పాకిస్తాన్‌తో యుద్ధం వద్దని అప్పట్లో మొత్తం అంతర్జాతీయ సమాజం వద్దని చిదంబరం తెలిపారు. 175 మంది ప్రాణాలను బలిగొన్న ఉగ్రవాద దాడులు జరిగిన కొద్ది రోజులకే కేంద్ర హోంమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పి. చిదంబరం(Chidambaram) ఓ వార్తా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వివరాలు వెల్లడించారు. యుద్ధం ప్రారంభించవద్దని మాకు చెప్పడానికి ప్రపంచం మొత్తం ఢిల్లీకి వచ్చిందన్నారు. అప్పటి అమెరికా విదేశాంగ కార్యదర్శిగా ఉన్న కొండోలీజా రైస్, తాను బాధ్యతలు స్వీకరించిన రెండు, మూడు రోజుల్లోనే తనను, ప్రధానమంత్రిని కలవడానికి ప్రత్యేకంగా వచ్చారని చెప్పారు.
“దయచేసి స్పందించకండి” అని ఆమె అన్నారు. ఇది ప్రభుత్వం తీసుకునే నిర్ణయం అని నేను చెప్పాను. అధికారిక రహస్యాన్ని వెల్లడించకుండానే, ప్రతీకారం తీర్చుకోవాలని నా మనసులో మెదిలింది” అని ఆయన వివరించారు.ప్రతీకార చర్యల గురించి తాను ప్రధానమంత్రితో పాటు ముఖ్యమైన ఇతర వ్యక్తులతో చర్చించినట్లు తెలిపారు.దాడి జరుగుతున్నప్పుడు కూడా ప్రధానమంత్రి దీని గురించి చర్చించారని, అయితే, ఈ పరిస్థితికి భౌతికంగా స్పందించకూడదనే ముగించాలన్న విధానం విదేశాంగ శాఖ, IFS ద్వారా ఎక్కువగా ప్రభావితమైందన్నారు.
Chidambaram | కొట్టిపడేసిన బీజేపీ
చిదంబరం వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా మండిపడింది. ముంబై దాడులు విదేశీ శక్తుల ఒత్తిడి కారణంగా తప్పుగా నిర్వహించబడ్డాయని దేశానికి ఇప్పటికే తెలుసునని మాజీ హోంమంత్రి అంగీకరించారని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి పేర్కొన్నారు. ముంబై దాడుల తర్వాత చిదంబరం హోంమంత్రిగా బాధ్యతలు స్వీకరించడానికి మొదట్లో ఇష్టపడలేదని చెప్పారు. దేశ ప్రజలంతా పాకిస్తాన్‌పై సైనిక చర్య తీసుకోవాలని కోరుకున్నారని, కానీ అప్పటి ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేయలేదని మండిపడ్డారు. దీంతో “ఇతరులు విజయం సాధించారని” బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా ఆరోపించారు. పాకిస్తాన్‌పై చర్యలు చేపట్టకుండా కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు సోనియా గాంధీ(Sonia Gandhi) లేదా అప్పటి ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ అడ్డుకున్నారా? అని ఆయన ప్రశ్నించారు. యుపిఎ ప్రభుత్వం కొండోలీజా రైస్ ప్రభావంతో పనిచేస్తున్నట్లు కనిపిస్తోందని ఆరోపించారు.