అక్షరటుడే, మెండోరా : Mendora Mandal | పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని మాజీ సర్పంచ్ (Former Sarpanch)లు నినదించారు. బిల్లుల సాధన కోసం అసెంబ్లీ ముట్టడికి బయలు దేరారు.
Mendora Mandal | మెండోరా నుంచి..
గ్రామ పంచాయతీలకు సంబంధించిన పెండింగ్ బిల్లులు (Pending Bills) చెల్లించాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీ ముట్టడికి వెళ్తున్న మాజీ సర్పంచులను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. గ్రామాల్లో వివిధ అభివృద్ధి పనుల నిమిత్తం రూ.లక్షల్లో సొంత డబ్బులు ఖర్చు చేశామని.. వాటి బిల్లులు ఇప్పటికీ విడుదల కాలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్థికంగా అనేక ఇబ్బందుల్లో ఉన్నామని కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) తక్షణమే తమకు పెండింగ్ బిల్లులు విడుదల చేయించాలని వారు డిమాండ్ చేశారు. అసెంబ్లీకి వెళ్లేందుకు యత్నించిన వారిలో రాజిరెడ్డి (మెండోరా), గంగారెడ్డి (వెల్గటూర్), గంగారెడ్డి (బుస్సాపూర్), బిస్బావద్దీన్ (పోచంపాడ్–మాజీ సర్పంచ్) ఉన్నారని..వారిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై సుహాసిని (SI Suhasini) తెలిపారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారకుండా ఈ చర్యలు తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.