అక్షరటుడే, బోధన్ : Vajpayee Jayanti | భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి (Atal Bihari Vajpayee) జయంతిని బీజేపీ నాయకులు గురువారం ఘనంగా నిర్వహించారు. బోధన్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో స్థానిక అంబేడ్కర్ చౌరస్తా వద్ద ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
బోధన్ పట్టణంలోని (Bodhan town) ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. బీజేపీ పట్టణ అధ్యక్షుడు పసులోటి గోపి కిషన్ మాట్లాడుతూ వాజపేయి దేశ అభివృద్ధికి కొత్త బాటలు వేసిన దార్శనికుడు అని కొనియాడారు. గ్రామీణ సడక్ యోజన వంటి కార్యక్రమాలతో పల్లెలకు రవాణా సౌకర్యం కల్పించిన నాయకుడు అన్నారు. ప్రజలు ఆయనని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు రామచందర్, కొలిపాక బాలరాజు, మాసిని వినోద్, సిర్ప సుదర్శన్, గొడుగు ధర్మపురి, మీర్జాపురం అరవింద్, రాజులదేవి పవన్ కుమార్, కందికట్ల వాసు, పెరక వెంకటేష్, గుంత గంగాధర్, గాదె సందీప్, గంగుల శ్రీకాంత్, ఏనుగంటి గౌతం గౌడ్, కలికోట కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Vajpayee Jayanti | లింగంపేటలో..

అక్షరటుడే, లింగంపేట : Vajpayee Jayanti | లింగంపేట మండల (Lingampet mandal) కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో గురువారం వాజ్పేయి జయంతి నిర్వహించారు. పార్టీ మండల అధ్యక్షుడు బొల్లారం క్రాంతికుమార్ మాట్లాడుతూ.. భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపకులుగా ఆయన పార్టీ కోసం చేసినటువంటి సేవ చిరస్మరణీయం అన్నారు. కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యుడు జక్సని దత్తు రాములు, జిల్లా కౌన్సిల్ మెంబర్ వడ్ల రామచందర్, అంద్యాల ఉద్దేశ్ కుమార్, తిరుమల నరేష్, నవీన్ కుమార్, నరేష్, దిలీప్, వెంకటేష్, సురేష్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.