111
అక్షరటుడే, ఆర్మూర్ : Armoor | ఆర్మూర్ మాజీ ఎంపీపీ (Former MPP) పస్క నర్సయ్య కారును గుర్తు తెలియని వ్యక్తులు కాలబెట్టారు. ఈ ఘటన మచ్చర్ల గ్రామం (Macharla Village)లో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది.
మాజీ ఎంపీపీ తన స్విఫ్ట్ డిజైర్ కారు (Swift Dzire Car)ను ఇంటి ఎదుట పార్క్ చేశాడు. రాత్రి సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు నిప్పటించడంతో పూర్తిగా దగ్ధమైంది. సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ కక్షలతోనే కారుకు నిప్పు పెట్టినట్లు పలువురు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై ఆర్మూర్ పోలీసు (Armoor Police)లకు బాధితుడు ఫిర్యాదు చేశారు. ఆర్మూర్ ఎస్హెచ్వో సత్యనారాయణ గౌడ్ (SHO Satyanarayana Goud) సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.