అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | కామారెడ్డి మండల తాజా మాజీ ఎంపీపీ పిప్పిరి ఆంజనేయులు మృతి బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటని మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అన్నారు. క్యాన్సర్తో బాధపడుతూ శుక్రవారం రాత్రి పిప్పిరి ఆంజనేయులు మృతి చెందారు. శనివారం మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ముజీబోద్దీన్, పార్టీ నాయకులు ఆంజనేయులు పార్థీవ దేహానికి నివాళులర్పించారు. పార్టీకి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. మాజీ ఎంపీపీ పార్థీవదేహంపై పుష్పగుచ్ఛం ఉంచే సమయంలో గంప గోవర్ధన్ భావోద్వేగానికి గురయ్యారు. కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. సహచర మిత్రుడిని కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేశారు.
Kamareddy | మాజీ ఎంపీపీ మృతి పార్టీకి తీరని లోటు: మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్
Published on
