Homeజిల్లాలుకామారెడ్డిFormer MP Bibi Patil | వరద ముంపు ప్రాంతాల్లో మాజీ ఎంపీ బీబీ పాటిల్​...

Former MP Bibi Patil | వరద ముంపు ప్రాంతాల్లో మాజీ ఎంపీ బీబీ పాటిల్​ పర్యటన..

- Advertisement -

అక్షరటుడే, ఎల్లారెడ్డి : Former MP Bibi Patil | జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలోని కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో మాజీ ఎంపీ బీబీ పాటిల్ పర్యటించారు.

అతి భారీ వర్షాలకు దెబ్బతిన్న ప్రాంతాలను క్షేత్రస్థాయిలో సందర్శించారు. సర్వం కోల్పోయిన ఆయా గ్రామాల ప్రజలతో మాట్లాడారు. వారిలో ధైర్యం నింపారు.

బొగ్గు గుడిసె Boggu Gudise, అన్నాసాగర్ Anna Sagar లో బీబీ పాటిల్​ పర్యటించారు. వరదలో దుకాణాలు మునిగిపోయి నష్టపోయిన వ్యాపారులతో మాట్లాడారు. వారికి ఆర్థిక సహాయం అందజేశారు.

అనంతరం దెబ్బతిన్న కళ్యాణి ప్రాజెక్టు Kalyani project ను బీబీ పాటిల్​ సందర్శించారు. జరిగిన నష్టాన్ని పరిశీలించారు. తదుపరి పూర్తిగా కొట్టుకుపోయిన వెంకటాపూర్ ప్రధాన రహదారిని పరిశీలించారు.

ఇరిగేషన్ అధికారితో మాజీ ఎంపీ మాట్లాడారు. రోడ్డును ప్రయాణానికి అనుకూలంగా తక్షణమే మార్చాలని కోరారు. తర్వాత ఎల్లారెడ్డి పట్టణంలో గాంధీ చౌక్​ వద్దకు వెళ్లారు. కటికే హుస్సేన్ ఇల్లును పరిశీలించారు.

Former MP Bibi Patil : ప్రజలకు మనో ధైర్యం ఇచ్చిన మాజీ ఎంపీ..

అనంతరం తిమ్మాపూర్ గ్రామానికి మాజీ ఎంపీ వెళ్లారు. అక్కడ పూర్తిగా తెగిపోయిన చెరువును పరిశీలించారు. గ్రామస్థులకు మాజీ ఎంపీ బీబీ పాటిల్ మనోధైర్యాన్ని ఇచ్చారు​.

Must Read
Related News