అక్షరటుడే, కోటగిరి: BB Patil | వారం రోజులుగా కురిసిన భారీ వర్షాలకు పంట పొలాలు నీట మునిగాయి. దీంతో జహీరాబాద్ (Zaheerabad) మాజీ ఎంపీ బీబీ పాటిల్ పరిశీలించారు.
పోతంగల్ (Pothangal) మండలంలోని మంజీర పరీవాహక ప్రాంతాలైన కల్లూర్, కోడిచెర్ల, పొతంగల్, హంగర్గ, కారేగాం, సుంకిని గ్రామాల్లో ఆదివారం పర్యటించి రైతులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బీబీ పాటిల్ మాట్లాడుతూ.. నష్టపోయిన రైతుల పంట పొలాలను అధికారులు పరిశీలించి, వెంటనే నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో కూడా ఫసల్ యోజన (Fasal Yojana Scheme) అమలు చేస్తే రైతులకు బీమా వర్తించేదన్నారు. రాష్ట్రంలో ఫసల్ యోజన బీమా అమలు చేసి రైతులను ఆదుకోవాలన్నారు. కార్యక్రమంలో బీజేపీ మండలాధ్యక్షులు కల్లూరి హన్మాండ్లు (బజరంగ్) ఎముల నవీన్, హరి కృష్ణ, బాన్సువాడ బీజేపీ నాయకులు, ఎన్ఆర్ఐ కోనేరు శశాంక్, బీజేపీ నాయకులు ప్రకాష్ పటేల్, విజయ్ పటేల్, గంగాధర్ పటేల్, పబ్బ శేఖర్, దిగంబర్ పటేల్, సంజు మహారాజ్, ఓమన్న పటేల్, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.