అక్షరటుడే, ఆర్మూర్ : Jeevan Reddy Met KTR | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి, బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ భేటీ అయ్యారు. హైదరాబాద్ (Hyderabad)లోని కేటీఆర్ నివాసంలో సోమవారం ఆయనతో సమావేశయ్యారు.
ఈ సందర్భంగా సిట్ విచారణల (SIT Investigation) పేరుతో పార్టీ నేతలపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు, మున్సిపాలిటీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు తదితర అంశాలపై చర్చించారు. నిజామాబాద్ జిల్లా (Nizamabad District)లో తాజా రాజకీయ పరిస్థితులపై కేటీఆర్.. జీవన్ రెడ్డితో మాట్లాడి చర్చించారు.
Jeevan Reddy Met KTR | సజ్జనార్‌పై జీవన్‌రెడ్డి వ్యాఖ్యల దుమారం
సీపీ సజ్జనార్ (CP Sajjanar)పై జీవన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. ఆయన మాట్లాడుతూ ‘తాము కట్టిన పోలీస్ కమాండ్ కంట్రోల్లో ఉన్న సజ్జనార్.. తెలంగాణ జాతిపిత కేసీఆర్ (KCR) ఇంటికే నోటీసులు అంటిస్తారా.. పింక్ బుక్కులో ఫస్ట్ పేరు సజ్జనార్దే ఉంటుంది. హరీశ్ రావు (Harish Rao), కేటీఆర్ చెప్పినా ఆ పేరు తొలగించబోం.. గతంలో నాపై కేసు పెట్టి చేయలేకపోయారు.. ఇప్పుడు మా బాస్ కేసీఆర్‌ను ఏం చేస్తారంటూ’ వ్యాఖ్యానించారు. మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ హెచ్చరించారు. జీవన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలోని పొలిటికల్, పోలీస్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారాయి.