అక్షరటుడే, వెబ్‌డెస్క్:Vallabhaneni Vamshi | గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ నకిలీ ఇళ్ల పట్టాల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. వల్లభనేని వంశీ Vallabhaneni Vamsi గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. కోర్టుకు వచ్చిన సమయాల్లో కూడా వంశీ ఎంతో నీరసంగా కనిపించారు. అయితే ఇటీవల వంశీ తీవ్ర అస్వస్థతకు గురికావడంతో వెంటనే కంకిపాడు ప్రభుత్వాస్పత్రి(Kankipadu Government Hospital)కి తరలించారు. అక్కడి వైద్యులు మాజీ ఎమ్మెల్యేకు చికిత్స అందజేశారు. కానీ మెరుగైన వైద్యం కోసం వైద్యుల సూచన మేరకు వంశీని గుంటూరు జీజీహెచ్‌కు పోలీసులు తరలించారు. చాలా రోజులుగా శ్వాస సంబంధిత సమస్యతో బాధపడుతున్న వంశీకి చికిత్స అందించి ఆ తరువాత ఆయన్ను తిరిగి జైలుకు తరలించారు. తాజాగా మరోసారి అనారోగ్య సమస్యతో వంశీని గుంటూరు జీజీహెచ్‌కు తీసుకువచ్చారు పోలీసులు.
Vallabhaneni Vamshi | మళ్లీ అనారోగ్య సమస్య..
శ్వాసకోశ సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్న వల్లభనేని వంశీని ఈరోజు (సోమవారం) పోలీసులు జీజీహెచ్(GGH)కు తరలించారు. మెరుగైన వైద్యం కోసం వైద్యుల సూచన మేరకు వంశీని గుంటూరు జీజీహెచ్‌కు పోలీసులు తరలించారు. జీజీహెచ్‌లో వంశీకి వైద్యులు చికిత్స అందజేస్తున్నారు. కాగా.. జైలులో Jail శ్వాస సంబంధింత సమస్యతో బాధపడుతున్న విషయాన్ని న్యాయాధికారి(Judicial Officer)కి వంశీ వివరించారు. దీంతో వైద్యం అందించాల్సిందిగా న్యాయధాకారి పోలీసులకు ఆదేశాలు ఇచ్చారు. వంశీ ఆరోగ్య పరిస్థితిపై కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వంశీని ఆస్పత్రి లోపలికి తరలించిన తర్వాత జీజీహెచ్ ప్రధాన గేటును పోలీసులు(Police) మూసి వేశారు. దీంతో ఆస్పత్రికి వచ్చే రోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
పోలీసుల తీరుతో మిగిలిన రోగులు అవస్థలు పడాల్సి వస్తోంది. ఇలా ఆస్పత్రి(Hospital) ప్రధాన గేటును మూసివేస్తే ఎలా అంటూ రోగుల బంధువులు మండిపడుతున్నారు. మరోవైపు వల్లభనేని వంశీ ఆరోగ్య పరిస్థితిపై ప్రభుత్వానికి కనీసం మానవత్వం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు (Perni Nani). ఇటీవల ఆయనని పరామర్శించిన నాని..ఊపిరితిత్తులు ఆడక ఇబ్బందిపడుతున్న ఓ పేషెంట్‌ను విచారణ పేరుతో ఆస్పత్రి నుంచి పోలీస్ స్టేషన్‌కు Police Station తరలించారని మండిపడ్డారు. ఓ మాజీ ఎమ్మెల్యేను అనారోగ్యంతో ఆస్పత్రికి తీసుకువస్తే.. ఓఆర్ఎస్ ప్యాకెట్‌ను బయట కొనుక్కోవాలని డాక్టర్ చెప్తున్నారని, ఇంత దిక్కుమాలిన ప్రభుత్వాన్ని ఎక్కడా చూడలేదంటూ పేర్ని నాని మండిపడ్డారు.