అక్షరటుడే, వెబ్డెస్క్ : Ex Mla Shakeel Arrest | బోధన్ bodhan మాజీ ఎమ్మెల్యే former mla షకీల్ shakeelను పోలీసులు అరెస్ట్ చేశారు. పంజాగుట్ట కేసు punjagutta caseలో షకీల్ ను గురువారం అరెస్ట్ చేసిన పోలీసులు అనంతరం కోర్టులో హాజరు పరిచారు. అయితే అనారోగ్య కారణాలతో షకీల్కు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. హైదరాబాద్లోని ప్రగతిభవన్ ముందు షకీల్ కుమారుడు shakeel son గతంలో యాక్సిడెంట్ చేసిన విషయం తెలిసిందే.
ఈ కేసులో షకీల్ తన కుమారుడిని తప్పించారు. కుమారుడి స్థానంలో మరొకరిని పోలీసుల ముందు లొంగిపోయేలా చేశారు. అప్పట్లో ఈ కేసులో షకీల్కు సహకరించిన పోలీసులపై కూడా ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. అయితే అప్పటి నుంచి దుబాయి dubaiలో ఉన్న షకీల్ ఇటీవల తన తల్లి మృతి చెందడంతో తెలంగాణకు వచ్చారు. ఈ క్రమంలో ఆయన్ను అరెస్టు చేయగా కోర్టు బెయిల్ మంజూరు చేసింది.