అక్షరటుడే, డోంగ్లీ: Kamareddy Collector | జుక్కల్ నియోజకవర్గంలో వరద నష్టాన్ని అంచనా వేసి వెంటనే చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే (Former MLA Hanmant Shinde) కోరారు. ఈ మేరకు శుక్రవారం కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్‌ను (Collector Ashish Sangwan) కలిసి వినతిపత్రం అందజేశారు.
ఇటీవల కురిసిన భారీవర్షాల కారణంగా భారీఎత్తున పంటనష్టం జరిగిందన్నారు. నష్టపోయిన రైతులకు వెంటనే నష్టపరిహారం అందించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం ఎస్పీ రాజేష్ చంద్రను (SP Rajesh Chandra) సైతం కలిశారు. నియోజకవర్గంలో పరిస్థితిపై చర్చించారు.