అక్షరటుడే, బోధన్: Former MLA Shakeel | కాంగ్రెస్ కార్యకర్తలపై బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ (former MLA Shakeel) కీలక వ్యాఖ్యలు చేశారు. పట్టణంలోని ఆయన స్వగృహంలో శుక్రవారం బీఆర్ఎస్ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు.
Former MLA Shakeel | బీఆర్ఎస్ కార్యర్తలను సతాయిస్తూ ఊరుకోం..
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..బీఆర్ఎస్ కార్యర్తలను సతాయిస్తూ ఊరుకునేది లేదని కాంగ్రెస్ కార్యకర్తలను (Congress workers) ఉద్దేశించి మాట్లాడారు. తాము అధికారంలో ఉన్న పదేళ్లు ఏ పార్టీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టలేదన్నారు. కాని ప్రస్తుతం కాంగ్రెస్ నాయకులు పలువురు బీఆర్ఎస్ నాయకులను టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారన్నారు. ఇలాంటి సహించేది లేదని తేల్చిచెప్పారు. పార్టీలకతీతంగా అందిరికీ పనులు చేసిపెట్టామన్నారు. రాబోయే రోజుల్లో మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి రాబోతుందని.. ఇప్పుడు సతాయించిన వారిని అప్పుడు వదిలిపెట్టే ప్రసక్తి లేదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు గిర్ధావర్ గంగారెడ్డి, వీఆర్ దేశాయ్ కార్యకర్తలు పాల్గొన్నారు.