అక్షరటుడే, వెబ్‌డెస్క్: Former MLA Jeevan Reddy | సీపీ సజ్జనార్ CP Sajjanar జాగ్రత.. నన్నే ఏమీ చేయలేకపోయారు.. కేసీఆర్‌ను ఏం చేయలేరని అని ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి అన్నారు. తెలంగాణ జాతిపిత కేసీఆర్‌ను విచారణల పేరుతో అవమానించాలని చూస్తే ఊరుకోబోమని స్పష్టం చేశారు. తెలంగాణ భవన్ Telangana Bhavan లో ఆయన మీడియాతో మాట్లాడారు.
డీజీపీ కావాలని సీపీ సజ్జనార్ కలలు కంటున్నారని జీవన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. కర్ణాటకలో కాంగ్రెస్ తరఫున ఎంపీగా పోటీ చేసేందుకు సజ్జనార్ ప్రయత్నించారన్నారు. పింక్‌బుక్‌లో సజ్జనార్ నంబర్-1లో ఉంటారన్నారు. ఆయన కర్ణాటక వెళ్లినా.. పుణె వెళ్లినా.. చివరికి ఎంపీ అయినా సరే తాము వదిలిపెట్టమని జీవన్‌రెడ్డి హెచ్చరించారు.
కేసీఆర్‌కు నోటీసులు ఇవ్వడం అంటే.. బ్రిటీషోళ్లపై పోరాడి భారత్‌కు స్వా తంత్య్రం తెచ్చిన గాంధీకి నోటీసులు ఇచ్చినట్లే అని వర్ణించారు. కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం వల్లే పీసీసీ చీఫ్‌గా మహేశ్‌కుమార్‌గౌడ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రామచంద్రరావు అయ్యారని చెప్పుకొచ్చారు.
Former MLA Jeevan Reddy | కర్ణాటకలో మాల్స్
తెలంగాణ రాష్ట్రంలో దోచుకున్న సొమ్ముతో కర్ణాటకలో సీపీ సజ్జనార్ మాల్స్ కట్టారని భారాస నాయకుడు కురువ విజయ్ BRS leader Kuruvavijay ఆరోపించారు. హుబ్లీ నుంచి సజ్జనార్ కాంగ్రెస్ తరఫున ఎంపీగా పోటీ చేయాలని చూస్తున్నారని పేర్కొన్నారు.
భారాస తిరిగి అధికారంలోకి వచ్చాక సజ్జనార్ పార్లమెంట్‌కు వెళ్లినా రప్పా రప్పా లాక్కొస్తామన్నారు. పోలీసులను నియంత్రణలో ఉంచుకోవాలని డీజీపీకి ఆయన సూచించారు.