Homeజిల్లాలుకామారెడ్డిKamareddy | మాజీ ఎమ్మెల్యే మతిస్థిమితం తప్పి మాట్లాడుతున్నారు.. ​

Kamareddy | మాజీ ఎమ్మెల్యే మతిస్థిమితం తప్పి మాట్లాడుతున్నారు.. ​

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ రాక మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ (former MLA Gampa Govardhan) మతిస్థిమితం తప్పి మాట్లాడుతున్నారని డీసీసీ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్ రావు అన్నారు.

జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం సాయంత్రం నిర్వహించిన మీడియా సమావేశంలో కైలాస్ శ్రీనివాస్ రావు (DCC President Kailas Srinivas Rao) మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అసమర్థ ప్రభుత్వమని మాట్లాడి తన పరువు తన పార్టీ పరువు తీసుకుంటున్నారని విమర్శించారు. పదేళ్ల పాలనలో ప్రజలకు ఆ పార్టీ పెద్దగా చేసిందేమీ లేదన్నారు. రేషన్ కార్డులు (Ration Cards) ఇవ్వలేదని, నియోజకవర్గానికి 10 ఇళ్లు కూడా ఇవ్వలేకపోయారని ఎద్దేవా చేశారు.

బీఆర్ఎస్ హయాంలో ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చి పేపర్ లీకులు చేసి సరిపెట్టుకున్నారు తప్ప ఉద్యోగాలు మాత్రం ఇవ్వలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం (Congress government) రెండేళ్లలో 65 వేల ఉద్యోగాలు ఇచ్చిందన్నారు. అసమర్ధత అంటే.. బీఆర్​ఎస్​ నాయకులు అద్దం ముందు నిలబడి చూసుకున్నట్టు ఉంటుందని దుయ్యబట్టారు. ప్రభుత్వంపై విమర్శించే అవకాశం ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం పాలన అందిస్తుందన్నారు.

బీఆర్ఎస్ హయాంలో దోపిడీ తప్ప అభివృద్ధి జరగలేదని, కుటుంబం మొత్తం రాష్ట్రాన్ని దోచుకుంటే.. ఎమ్మెల్యేలంతా నియోజకవర్గాలను దోచుకున్నారని విమర్శించారు. స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ (Congress party) కనీవిని ఎరుగని రీతిలో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు పండ్ల రాజు, కారంగుల అశోక్ రెడ్డి, ఐరేని సందీప్, గోనే శీను, గుడుగుల శీను, పంపరి లక్ష్మణ్, షేరు, అంజద్ తదితరులు పాల్గొన్నారు.

Must Read
Related News