అక్షరటుడే, ఎల్లారెడ్డి: Nagireddypet | నాగిరెడ్డిపేట మండలం ధర్మారెడ్డి గ్రామ పంచాయతీకి (Dharmareddy village panchayat) నూతనంగా ఎన్నికైన పాలకవర్గాన్ని సోమవారం మాజీ ఎమ్మెల్యే జనార్దన్ గౌడ్ (Former MLA Janardhan Goud), జడ్పీటీసీ మాజీ సభ్యుడు మనోహర్ రెడ్డి ఘనంగా సన్మానించారు. బీఆర్ఎస్ మద్దతుదారులైన (BRS party supporters) సర్పంచ్ లక్ష్మి, ఉప సర్పంచ్ జైరాజ్, వార్డు సభ్యులు, గోపాల్ పేట్ సర్పంచ్ వంశీకృష్ణ గౌడ్లకు శాలువాలు కప్పి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామాభివృద్ధి కోసం నూతన పాలకవర్గం సమిష్టిగా పనిచేయాలని సూచించారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ పాలన సాగించాలన్నారు. గ్రామ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో గ్రామస్థులు, యువకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.