Homeజిల్లాలుకామారెడ్డిBanswada | రైతులకు మాజీ ఎమ్మెల్యే ఏనుగు పరామర్శ

Banswada | రైతులకు మాజీ ఎమ్మెల్యే ఏనుగు పరామర్శ

- Advertisement -

అక్షరటుడే, బాన్సువాడ: Banswada | బీర్కూర్‌ మండలం బరంగేడిగి గ్రామంలో (Barangedigi village) ఇటీవల కురిసిన భారీ వర్షానికి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వరి, మొక్కజొన్నతోపాటు విత్తన దశలో ఉన్న పంటలు నీట మునిగిపోయి, రైతులు తీవ్రంగా నష్టపోయారు.

దీంతో మాజీ ఎమ్మెల్యే, బాన్సువాడ కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జి ఏనుగు రవీందర్‌ రెడ్డి (Enugu Ravinder Reddy) ఆదివారం గ్రామాన్ని సందర్శించి రైతులను పరామర్శించారు. నష్టంపై ప్రభుత్వానికి నివేదిక అందించి, పరిహారం అందేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తమది రైతు ప్రభుత్వమని, ఆందోళన చెందవద్దని సూచించారు. కార్యక్రమంలో బీర్కూర్‌ మాజీ జెడ్పీటీసీ ద్రోణవల్లి సతీష్, గ్రామ పెద్దలు, స్థానిక కాంగ్రెస్‌ నాయకులు, రైతులు పాల్గొన్నారు.