అక్షరటుడే, ఇందూరు: Bigala Ganesh Gupta | ప్రముఖ న్యాయవాది కిరణ్కుమార్ గౌడ్ శుక్రవారం గుండెపోటుతో హఠాన్మరణం చెందిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్ పార్టీ (BRS Party) న్యాయ సలహాదారుడిగాను ఆయన సేవలందించారు.
ఈ మేరకు అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా (former Urban MLA Bigala Ganesh Gupta) శనివారం కిరణ్కుమార్ గౌడ్ ఇంటికి వెళ్లారు. ఆయన పార్ధీవదేహానికి నివాళులు అర్పించారు. కిరణ్కుమార్ గౌడ్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. కిరణ్ కుమార్ గౌడ్ కుటుంబానికి అండగా ఉంటానని హామీనిచ్చారు. ఆయన వెంట బీఆర్ఎస్ నాయకులు సత్యప్రకాశ్, సుజిత్ సింగ్, సిర్పరాజు, ఠాకూర్, చింతకాయల రాజు తదితరులున్నారు.