అక్షరటుడే, వెబ్‌డెస్క్: Harish Rao | మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు Mla Harish rao కీలక వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ ktrకు పార్టీ బాధ్యతలు అప్పగిస్తే స్వాగతిస్తానని పేర్కొన్నారు. మంగళవారం ఆయన హైదరాబాద్ hyderabadలో మాట్లాడారు. బీఆర్ఎస్ brs ఆవిర్భవించిన నాటి నుంచి తాను పనిచేస్తున్నట్లు హరీశ్‌రావు తెలిపారు. ఏ రోజూ కూడా పార్టీ గీత దాటలేదన్నారు. ఇప్పుడు కూడా కేటీఆర్‌కు బాధ్యతలు అప్పగిస్తే స్వాగతిస్తానని తెలిపారు. తాను కేసీఆర్ kcrకు క్రమశిక్షణ కలిగిన కార్యకర్తను అని స్పష్టం చేశారు. కేసీఆర్ ఆదేశాలను పాటించి, పార్టీ కోసం పనిచేస్తానని తెలిపారు. బీఆర్ఎస్‌లో ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని తాను ఎన్నో సార్లు చెప్పినట్లు హరీశ్‌రావు గుర్తు చేశారు.
Harish Rao | తప్పుడు వార్తలపై ఫిర్యాదు చేశాం..
తాను పార్టీ మారుతున్నట్లు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు హరీశ్‌రావు తెలిపారు. ఆ వార్తలను ఖండించానని, తమ పార్టీ నాయకుడు దాసోజు శ్రవణ్‌తో చెప్పి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇప్పించానని గుర్తు చేశారు. తప్పుడు ప్రచారాలను చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరారు.
Harish Rao | రైతులు ఇబ్బందులు పడుతుంటే.. అందాల పోటీలా..
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను farmers పట్టించుకోవడం లేదని హరీశ్‌రావు ఆరోపించారు. అందాల పోటీల miss world competitions చుట్టు తిరుగుతున్న ప్రభుత్వం ధాన్యం గురించి పట్టించుకోవడం లేదన్నారు. ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. 70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొంటామని ప్రభుత్వం చెప్పిందని, కానీ ఇప్పటి వరకు 40 లక్షల మెట్రిక్ టన్నులే సేకరించిందన్నారు.
ధాన్యం విక్రయించిన రైతులకు రూ.4 వేల కోట్లు ఇవ్వాల్సి ఉందన్నారు. కొనుగోలు కేంద్రంలో ధాన్యం అమ్మినా 10 రోజుల తర్వాత కూడా డబ్బులు రావడం లేదని విమర్శించారు. సన్నవడ్లకు బోనస్ bonus amount జమ చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లారీల కొరతతో ధాన్యం కొనుగోళ్లు నత్తనడకన సాగుతున్నాయన్నారు. యాసంగి సీజన్ పూర్తయినా ఇంకా రైతు భరోసా rythy bharosa పూర్తి స్థాయిలో అందలేదని విమర్శించారు.