అక్షరటుడే, వెబ్‌డెస్క్: Harish Rao | మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు(Harish Rao) అస్వస్థతకు గురయ్యారు. హై ఫీవర్‌తో బాధ పడుతున్న ఆయనను బేగంపేట కిమ్స్ సన్‌షైన్ (Kims sunshine) ఆస్పత్రికి తరలించారు. వైద్యులకు ఆయన చికిత్స అందిస్తున్నారు. సోమవారం ఉదయం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR)ను ఏసీబీ విచారణకు పిలిచిన విషయం తెలిసిందే. విచారణ అనంతరం కేటీఆర్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో హరీశ్‌రావు కూడా మాట్లాడారు. అయితే కార్యక్రమం మధ్యలోనే ఆయన అస్వస్థతకు గురయ్యారు. దీంతో నాయకులు హరీశ్ రావును ఆస్పత్రికి తరలించారు. కేటీఆర్ కొద్ది సేపట్లో ఆస్పత్రికి వెళ్లి ఆయనను పరామర్శించనున్నారు.
