అక్షరటుడే, వెబ్‌డెస్క్: Ambati Rambabu | ఏపీలో మరోసారి రాజకీయాలు ఉద్రిక్తతంగా మారాయి. మాజీ మంత్రి అంబటి రాంబాబు (former minister Ambati Rambabu) ఆఫీస్‌పై టీడీపీ శ్రేణులు దాడికి పాల్పడ్డాయి. దీంతో అక్కడ వాతావరణం ఉద్రిక్తంగా మారింది.
గుంటూరులో (Guntur) వేంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు చేసేందుకు అంబటి రాంబాబు శనివారం బయలుదేరారు. ఆయనను టీడీపీ నాయకులు అడ్డుకున్నారు. కర్రలు, రాడ్లతో దాడికి యత్నించారు. దీంతో చంద్రబాబును (CM Chandrababu) అంబటి తిట్టారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. చంద్రబాబుకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ఆయన ఆఫీస్‌ను ముట్టడించారు.
Ambati Rambabu | హైటెన్షన్
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై అంబటి రాంబాబు అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు వీడియో వైరల్ కావడంతో గుంటూరు నవభారత్ నగర్‌లోని అంబటి ఆఫీస్‌ను టీడీపీ కార్యకర్తలు ముట్టడించారు. వెంటనే ముఖ్యమంత్రికి అంబటి క్షమాపణలు చెప్పాలన్నారు. క్షమాపణ చెప్పే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని కూర్చుకున్నారు. గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్లా మాధవి ఆధ్వర్యంలో భారీగా మహిళా కార్యకర్తలు ఆందోళనకు తరలి వచ్చారు. ఈ సందర్భంగా అంబటి కారు, ఆఫీస్‌పై కొందరు దాడి చేశారు. టీడీపీ ముట్టడి నేపథ్యంలో వైసీపీ శ్రేణులు సైతం పెద్ద మొత్తంలో అక్కడకు తరలి వస్తున్నాయి. దీంతో పోలీసులు భారీగా మోహరించారు. అంబటి ఇంటి వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.