ePaper
More
    HomeతెలంగాణACB Case | మాజీ ఈఎన్​సీ మురళీధర్​రావు అక్రమాస్తులు మాములుగా లేవుగా..

    ACB Case | మాజీ ఈఎన్​సీ మురళీధర్​రావు అక్రమాస్తులు మాములుగా లేవుగా..

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​ : ACB Case | కాళేశ్వరం ప్రాజెక్ట్​ (Kaleshwaram Project)లో కీలకంగా వ్యవహరించిన మాజీ ఈఎన్​సీ మురళీధర్​రావు (Former ENC Muralidhar Rao) అక్రమాస్తులు చూసి ఏసీబీ అధికారులే షాక్​ అయ్యారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణల నేపథ్యంలో మంగళవారం ఆయన ఇంటితో పాటు 11 ప్రాంతాల్లో అధికారులు దాడులు (ACB Raids) చేసిన విషయం తెలిసిందే. ఈ దాడుల్లో అధికారులు ఆయన ఆస్తులకు సంబంధించిన పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.

    ACB Case | మాజీ ఈఎన్​సీ ఆస్తులు..

    మురళీధర్​రావుకు హైదరాబాద్ (Hyderabad)​ నగరంలోని కొండాపూర్​లో ఒక విల్లా ఉంది. బంజరాహిల్స్​, యూసుఫ్​గూడ, బేగంపేట, కోకాపేట ప్రాంతాల్లో ఒక్కో ప్లాట్​ ఉన్నాయి. కరీంనగర్, హైదరాబాద్​ నగరాల్లో కమర్షియల్​ భవనాలు ఉన్నాయి. కోదాడలో ఒక అపార్ట్​మెంట్​ ఉంది. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్​లో సోలార్​ పవర్​ ప్రాజెక్ట్​ ఉండడం గమనార్హం. వరంగల్​లో ఒక అపార్ట్​మెంట్​ నిర్మాణంలో ఉంది. 11 ఎకరాల వ్యవసాయ భూమి, హైదరాబాద్ నగరంలోని పలు కీలక ప్రాంతాల్లో నాలుగు ఓపెన్​ ప్లాట్లు, మోకిలో 6500 చదరపు గజాల స్థలం ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. అంతేగాకుండా మూడు కార్లు, ఇందులో ఒకటి బెంజ్​ కారు, భారీగా బంగారు ఆభరణాలు, బ్యాంకు డిపాజిట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

    ACB Case | రిమాండ్​కు తరలింపు

    మాజీ ఈఎన్​సీ మురళీధర్​రావు ఇళ్లలో సోదాల అనంతరం ఆయనను ఏసీబీ అరెస్ట్​ చేసింది. మురళీధర్​రావును కోర్టులో హాజరు పర్చగా జడ్జి రిమాండ్​ విధించారు. తనిఖీలు ఇంకా కొనసాగుతాయని ఏసీబీ అధికారులు తెలిపారు. మాజీ ఈఎన్​సీ ఆస్తుల విలువ రూ.వందల కోట్ల మేర ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. కేసు విచారణ కొనసాగుతుందని తెలిపారు.

    More like this

    Nepal | నేపాల్‌ లో విధ్వంసం.. అధ్యక్షుడు, ప్రధాని ఇళ్లకు నిప్పు.. పలువురు మంత్రులపై దాడి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nepal | నేపాల్‌ లో రెండోరోజూ విధ్వంసకాండ కొనసాగింది. యువత ఆందోళనలతో హిమాయల దేశం...

    CP Sai Chaitanya | పోలీస్​ ఇమేజ్​ పెంచేవిధంగా విధులు నిర్వర్తించాలి: సీపీ సాయిచైతన్య

    అక్షరటుడే, బోధన్​: CP Sai Chaitanya | నిజామాబాద్​ కమిషనరేట్​ పరిధిలో పోలీస్​ ఇమేజ్​ను పెంచే విధంగా సిబ్బంది...

    Alumni reunion | 14న పూర్వ విద్యార్థుల సమ్మేళనం

    అక్షరటుడే, భిక్కనూరు: Alumni reunion | మండలంలో జిల్లా పరిషత్​ బాలుర ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం...