అక్షరటుడే, ఎల్లారెడ్డి: Jubilee Hills by election | జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో జరుగనున్న ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ (BRS) పలువురు సీనియర్ నాయకులకు ప్రచార బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి (MLA Prashanth Reddy) నాయకత్వంలో షేక్ పేట్ డివిజన్ ఇన్ఛార్జీగా ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్‌ను (Former MLA Jajala Surender) నియమించారు.
ఈ మేరకు మాజీ ఎమ్మెల్యే జాజాల మాట్లాడుతూ.. ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా నా మీద నమ్మకం ఉంచి బీఆర్ఎస్ పార్టీ షేక్ పేట (Sheikh Pet) ఇన్‌ఛార్జి బాధ్యతలు అప్పగించిందన్నారు. ఈ మేరకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ప్రశాంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపునకు అహర్నిశలు కృషి చేస్తానని చెప్పారు.