5
అక్షర టుడే, ఎల్లారెడ్డి: Yellareddy Mandal | ఎల్లారెడ్డి 9వ వార్డు మాజీ కౌన్సిలర్ గాదె విజయలక్ష్మి తిరుపతి తన ఉదారత చాటుకున్నారు. పట్టణానికి చెందిన రాములు అనే వృద్ధుడికి కళ్లు కనిపించవు. కుటుంబసభ్యులు ఎవరూ లేరు. ఒంటరిగా పాడుబడిన ఇంట్లో ఉండగ, ఇటీవల వర్షానికి కూలిపోయింది. దీంతో విషయం తెలుసుకున్న తిరుపతి వృద్ధుడిని అద్దె ఇంట్లోకి మార్చారు. ప్రతినెలా అద్దె చెల్లించేందుకు ఒప్పుకున్నాడు. దీంతో పలువురు ఆయన్ను అభినందించారు.