అక్షరటుడే, నిజామాబాద్ : Professor Limbadri : తెలంగాణ ఉన్నత విద్యా మండలి మాజీ ఛైర్మన్ ప్రొఫెసర్ రిక్క లింబాద్రి మాతృమూర్తి లక్ష్మమ్మ అనారోగ్యంతో శనివారం (ఆగస్టు 16) మరణించారు.
వీరి స్వగ్రామం నిజామాబాద్ జిల్లా Nizamabad district సిరికొండ మండలం రావుట్ల. 17న (ఆదివారం) ఉదయం 11 గంటలకు సొంత గ్రామంలో అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు.