అక్షరటుడే, బోధన్ : Former MLA Shakeel | ఫోన్ ట్యాపింగ్ కేసులో (Phone Tapping Case) సీఎం కేసీఆర్ (KCR)కు సిట్ నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ బోధన్ పట్టణంలో బీఆర్ఎస్ నాయకులు ఆందోళన నిర్వహించారు. ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యే షకీల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
Former MLA Shakeel | సీఎం దిష్టిబొమ్మ దహనం చేసేందుకు యత్నం..
బోధన్ (Bodhan) పట్టణంలో బీఆర్ఎస్ నాయకులు రాస్తారోకోకు దిగారు. నిరసన కార్యక్రమంలో బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్‌ను వేధించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) కుటిల యత్నాలు చేస్తోందని ఆరోపించారు. అనంతరం పట్టణంలోని ప్రధాన రహదారిపై సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) దిష్టిబొమ్మ దహనం చేసేందుకు యత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడుతోందని భావించిన పోలీసులు రాస్తారోకో చేస్తున్న బీఆర్ఎస్ నాయకులను సముదాయించే ప్రయత్నం చేశారు. ఆందోళన విరమించకపోవడంతో ఎమ్మెల్యే షకీల్‌ను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. కాగా.. షకీల్ అరెస్ట్‌ను నిరసిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున పోలీస్‌స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు.