Homeఅంతర్జాతీయంBangaldesh | బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు ఉరిశిక్ష

Bangaldesh | బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు ఉరిశిక్ష

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు ఉరి శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది. బంగ్లా అల్లర్లకు ఆమె కారణమని ఇంటర్నేషనల్‌ క్రైమ్స్‌ ట్రిబ్యునల్‌ తేల్చింది.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Bangaldesh | బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా (Sheikh Hasina)కు ఆ దేశ ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ ఉరిశిక్ష విధించింది. బంగ్లా అల్లర్లకు షేక్ హసీనానే కారణం అంటూ కోర్టు దోషిగా తేల్చింది.
బంగ్లాలో అల్లర్లు చెలరేగడంతో తన పదవికి రాజీనామా చేసి షేక్​ హసీనా భారత్​కు వచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె భారత్​లో తలదాచుకుంటున్నారు. అయితే బంగ్లా అల్లర్లలో పలువురు ప్రాణాలు కోల్పోయారు. పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరిగింది. దీనిపై ఢాకాలోని ఇంటర్నేషనల్‌ క్రైమ్స్‌ ట్రిబ్యునల్‌ (International Crimes Tribunal) విచారణ చేపట్టింది. ఈ కేసులో మాజీ ప్రధాని షేక్‌ హసీనాను దోషిగా తేల్చిన కోర్టు ఆమెకు మరణశిక్ష విధించింది.

Bangaldesh | 1400 మంది మృతి

గత సంవత్సరం విద్యార్థుల నేతృత్వంలో జరిగిన ఆందోళనలు అవామీ లీగ్ ప్రభుత్వం పతనానికి దారితీసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో నిరసనకారులను అణచివేయడానికి హసీనా యత్నించారు. ఈ క్రమంలో 1,400 మంది మరణించినట్లు సమాచారం. దీంతో ఆమెపై కోర్టు విచారణ చేపట్టింది. మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు బంగ్లాదేశ్ మాజీ ప్రధాన మంత్రి షేక్ హసీనాకు మరణశిక్ష విధిస్తున్నట్లు కోర్టు తెలిపింది.

Bangaldesh | స్పందించిన హసీనా

కోర్టు తనకు మరణ శిక్ష విధించడంపై షేక్​ హసీనా స్పందించారు. నెలల తరబడి జరిగిన విచారణను న్యాయశాస్త్ర జోక్​గా అభివర్ణించారు. తనపై ఆరోపణలను తోసిపుచ్చిన ఆమె ట్రిబ్యునల్‌ను కంగారూ కోర్టు అని పేర్కొన్నారు. రాజకీయంగా ప్రేరేపించి తనపై కేసు నమోదు చేశారన్నారు. కాగా ఆమె కుమారుడు మాట్లాడుతూ.. తీర్పు ముందే నిర్ణయించబడిందని అన్నారు. తమ పార్టీపై నిషేధం కొనసాగితే అవామీ లీగ్ మద్దతుదారులు ఫిబ్రవరి జాతీయ ఎన్నికలు కొనసాగడానికి అనుమతించరని హెచ్చరించారు.

Must Read
Related News